Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు..పోటెత్తిన భక్తజనం

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8వ రోజుకు చేరాయి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు..పోటెత్తిన భక్తజనం
New Update

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం బారులుదీరారు. దుర్గాదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది.

శుభాలు కలగజేస్తుందని నమ్మకం

పురాణాల ప్రకారం.. దుర్గతులను రూపుమాపే దుర్గ అవతారంలో అమ్మవారు కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజునే సంహరించింది. అందుకే దుర్గగా కీర్తించబడుతుంది. దుర్గమాసురుడిని వధించాక ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంగా వెలిశారని చెబుతారు. నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమీయడంలో ఎంతో ప్రాచుర్యం దాగి ఉంది. దుర్గే దుర్గతి నాశని అనే సూక్తి భక్తులకు ఎంతో శుభాలు కలగజేస్తుందని నమ్మకం. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పారద్రోలి సద్గతులను ఇస్తుంది. దివ్యరూపిణి అయిన దుర్గమ్మను దర్శించుకుంటే సకల శ్రేయోదాయకమని భక్తుల విశ్వాసం.

మహత్తు ఉన్న అలంకారంలో..

అమ్మవారు ఈ రోజున త్రిశూలం చేతబట్టి సింహాసనంపై అధీష్టించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి కాలి కింద దుర్గమాసురుడు అనే మహిషురుడిని తొక్కిపట్టి ఉంచుతూ భక్తులకు దర్శనమిస్తోంది. ఇంతటి మహత్తు ఉన్న అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిథినాడు ఆవిర్భవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. నేడు దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దుర్గాష్టమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు పోయి సద్గతులు ప్రసాదించబడతాయని భక్తుల విశ్వాసం.

ఇది కూడా చదవండి:  పండుగపూట విషాదం..అల్లుడిని, కూతురిని తీసుకొస్తూ మృత్యువాత



మరోవైపు దుర్గమ్మ గుడిపై 500 రూపాయల క్యూలైన్‌లో ముందుకు నడవక పోవటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారే తప్పా.. భక్తులు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోవటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి క్యూ లైన్స్‌లో భక్తులు బారులు తీరారు.

This browser does not support the video element.

#vijayawada #goddess-durga-avatar-darshan #sharannavaratra-celebrations #indrakiladri #8th-day
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe