వైద్య సంస్థల్లో 487 పోస్టులు.. ఫ్రీ అప్లికేషన్ వివరాలివే

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ వివిధ నగరాల్లోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నవంబర్ 30 అప్లికేషన్ చివరితేది.

వైద్య సంస్థల్లో 487 పోస్టులు.. ఫ్రీ అప్లికేషన్ వివరాలివే
New Update

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ భారీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో వైద్య సంస్థల్లో ఏర్పడిన ఖాళీలను భర్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. పూర్తి వివాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు రిసెర్చ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫీల్డ్‌ వర్కర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ క్లర్క్‌, ఫిజియోథెరపిస్ట్‌, మెడికల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌, యానిమల్‌ అటెండెంట్‌, లైబ్రరీ క్లర్క్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌), పారామెడికల్‌ వర్కర్‌, వర్క్‌షాప్‌ అటెండెంట్‌ మొదలైన ఆరోగ్యకేంద్రాల్లోని 487 పోస్టులు భర్తి చేయనున్నారు.

అప్లికేషన్ ఫీజు:
మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్ కెటగిరీ వాళ్లు రూ.600 చెల్లించాలి. ఇక గరిష్ఠ వయసు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, కొన్నిటికి 27 సంవత్సరాలు. మరికొన్నిటికి 30 ఏళ్లుగా నిర్ణయించారు. గరిష్ఠ వయసులో ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల మినహాయింపు ఉంటుంది.

Also read : ఆకాశవాణిలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే

అర్హతలు:
హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ 70 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌/ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌/ శానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అలాగే రెండేళ్ల ఉద్యోగానుభవంతోపాటు 30 ఏళ్ల వయసుకు మించరాదు.

ఫీల్డ్ వర్కర్ :
ఇందులో 140 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి పాసైనవారు వీటికి అర్హులు. వయసు 25 సంవత్సరాలకు మించకూడదు. ల్యాబొరేటరీ అటెండెంట్‌ 69 ఉద్యోగాలుండగా.. టెన్త్ పాసై ఉండాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిక్స్‌/యానిమల్‌ కేర్‌/ల్యాబొరేటరీ యానిమల్‌ కేర్‌/ప్రొడక్షన్‌ ఆఫ్‌ ఇమ్యునొబయలాజికల్‌ అండ్‌ యానిమల్‌ కేర్‌/వెటరినరీ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఏడాది ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా ఏడాది డిప్లొమా ఉండాలి. వయసు 27 సంవత్సరాలలోపే ఉండాలి.

నర్సింగ్‌ ఆఫీసర్‌:
ఈ శాఖలో 16 పోస్టులున్నాయి. బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌ పాసవ్వాలి. నర్స్‌/నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. లేదా జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ డిప్లొమా చేసి రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌/నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ అవ్వాలి. 50 పడకలు కలిసిన హాస్పిటల్‌లో కనీసం ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు గరిష్టంగా 30 ఏళ్లు.

పరీక్ష కేంద్రాలు:
ఢిల్లీ, చైన్నె, బెంగళూరు, ముంబై, లక్నో, రాంచీ, చండీగఢ్‌, గువహటి, కోల్‌కతా.

దరఖాస్తుకు చివరితేదీ:
2023 నవంబర్ 30లోగా ఆన్‌లైన్‌ లో ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 01నుంచి అడ్మిట్‌కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు రెండోవారం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. డిసెంబరు నాలుగోవారంలో జాయినింగ్. పూర్తి వివరాలకోసం ఈ వెబ్ సైట్ సంప్రదించవచ్చు. https://aiihph.gov.in/

పరీక్ష విధానం:
ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 60 ప్రశ్నలకుగానూ ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున కేటాయించారు. ఒక తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. పరీక్ష తేదీని వెబ్‌సైట్‌, అడ్మిట్‌కార్డుల ద్వారా తెలియజేస్తారు.

#487-jobs #medical-institutions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe