Puri Jagannath Temple: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు !

ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం కరోనా వైరస్ తర్వాత మొదటిసారిగా నాలుగు ద్వారాలను తెరిచి భక్తులను అనుమతించింది. గతంలో కరోన సమయంలో 3ద్వారాలను మూసివేయగా ఇప్పుడు తిరిగి సింహద్వారం, గుర్రపు ద్వారం, పులి ద్వారం, ఏనుగు ద్వారాలను అధికారులు తెరిచారు.

New Update
Puri Jagannath Temple: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు !

Puri Jagannath Temple 4 Doors Opened: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయానికి సింహద్వారం, గుర్రపు ద్వారం, పులి ద్వారం , ఏనుగు ద్వారాలను అధికారులు తెరిచారు. కానీ కరోనా సమయంలో మూడు ద్వారాలు మూసివేసి ఒక ద్వారం గుండానే భక్తుల అనుమతించారు.దీంతో ఎన్నికలముందు బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు గేట్లను మళ్లీ తెరుస్తామని హామీ ఇచ్చింది.

puri jagannath temple

ఆ విధంగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తో మొత్తం నాలుగు ద్వారాలను తెరిచి భక్తులను అనుమతించింది. ముఖ్యమంత్రి మోహన్ సరన్ మాజీ తదితరులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పూరీ జగన్నాథ ఆలయ నిర్వహణ కోసం ఒడిశా ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది.

Also Read: ఈ చిట్కాలను పాటించండి.. జూన్, జులై మొత్తం సంతోషంగా గడిచిపోతుంది!

Advertisment
తాజా కథనాలు