/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/snake-1-jpg.webp)
Python in Rangareddy District: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతకారు.భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండడంతో కంగుతిన్నారు. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు.
అయితే, అధికారులు వెంటనే ఘటన స్ధాలానికి చేరుకోకపోవడంతో చివరకు స్ధానికులే కొండచిలువను పట్టుకున్నారు.ఈలోపు అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. 20 ఫీట్లు ఉన్న భారీ కొండచిలువను చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. పట్టుకున్న కొండచిలువను అధికారులకు అప్పగించారు.
Also Read: బిగ్ బాస్-7 లో నామినేషన్స్ రచ్చ…షో బిగిన్స్