అమెరికా సహకారంతో అంతరిక్షయానం చేయనున్న 2 భారతీయులు..?

అమెరికా అంతరిక్ష సంస్థతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు భారత్ కు చెందిన సుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఎంపిక అయ్యారు.ఈ ఇద్దరు వ్యోమగాములకు ఆగస్టు మొదటి వారంలో శిక్షణ ప్రారంభిస్తామని నాసా ప్రకటించింది.

అమెరికా సహకారంతో అంతరిక్షయానం చేయనున్న 2 భారతీయులు..?
New Update

అమెరికా అంతరిక్ష సంస్థతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు భారత్ కు చెందిన సుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఎంపిక అయ్యారు.ఈ ఇద్దరు వ్యోమగాములకు ఆగస్టు మొదటి వారంలో శిక్షణ ప్రారంభిస్తామని నాసా ప్రకటించింది.

2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో-నాసా సంయుక్త ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తింపు పొందిన యాక్సియోమ్ (AXIOM)తో ఇస్రో ఒప్పందం చేసుకుంది.

సుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. వీరిద్దరూ భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం శిక్షణ ఇస్తున్న గ్రూప్ కెప్టెన్లు. ఈ ఇద్దరు వ్యోమగాములకు ఆగస్టు మొదటి వారంలో శిక్షణ ప్రారంభిస్తామని ప్రకటించారు.

#america
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe