Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్!

భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ ఆగస్టు 13 నుండి 15 వరకు కొనసాగనుంది.

Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్!
New Update

Independence Day 2024: భారత్ రేపు తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day 2024) జరుపుకోనుంది. ఈ సందర్భంగా పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇ-కామర్స్ కంపెనీలు ఇందులో ముందంజలో ఉన్నా, దేశీయ విమానయాన సంస్థలు కూడా ప్రయాణీకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా "ఫ్రీడమ్ సేల్"ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లపై చాలా ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. మీ పండుగల ప్రయాణం కోసం ఇది మంచి అవకాశం.

ఈ సేల్ ద్వారా, మీరు తక్కువ ధరకి విమాన టిక్కెట్లు, అదనపు సేవలు పొందవచ్చు. ఇండిగో తెలిపిన ప్రకారం, ఈ ఆఫర్ సాధారణ ధరల కన్నా చాలా పొదుపుగా ఉంటుంది. దేశీయ విమానాల ఛార్జీలు 1,015 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి. కుటుంబం లేదా స్నేహితులను కలవడానికి, లేదా విహారయాత్రకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. వన్-వే ఛార్జీలు 3,715 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని ఇండిగో తెలిపింది. ఈ తగ్గింపులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. 6E యాడ్-ఆన్‌లపై కూడా 15% తగ్గింపు అందిస్తున్నాయి. సీటు ఎంపిక, అదనపు లగేజీ, ఫాస్ట్ ఫార్వర్డ్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు ఈ యాడ్-ఆన్‌లలో ఉన్నాయి.

Also read: ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్

బుక్ చేసిన టిక్కెట్లు ఆగస్ట్ 22, 2024 నుంచి మార్చి 31, 2025 మధ్య ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ సర్వీస్ చేస్తున్న డైరెక్ట్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది, కోడ్‌షేర్ విమానాలకు కాదు. ధరలపై అదనపు పన్నులు, రుసుములు, ఛార్జీలు ఉంటాయి.

#independence-day-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe