/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-84.jpg)
సాధారణంగా చాలా మందికి పాములంటే భయం ఉంటుంది. విషసర్పాలు కాటు వేస్తే కొద్ది క్షణాల్లో మరణించిన ఘటనలు మనం తరచూ చూస్తుంటాం..అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కొండచిలువ పై చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో, ఒక వ్యక్తి కొండచిలువతో పోరాడుతున్న తీరు మీకు చెమటలు పట్టిస్తుంది. వీడియోలో వ్యక్తి పోరాటం చూపరులను షాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా నివ్వెరపోయారు.
అడవిలో కొండచిలువతో పోరాడండి:
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి సుమారు 14 అడుగుల కొండచిలువను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న వీడియో మీరు చూడవచ్చు. అతను కొండచిలువ నోటిని పట్టుకుని ఉండటంతో అతనిని అది మింగలేకపోతుంది. కొండచిలువ తీవ్రంగా అతని చేతి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నఅతను మాత్రం దానిని గట్టిగా నియంత్రిస్తున్నాడు.
View this post on Instagram
Follow Us