Moscow Attack: రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో ఒక్కాసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. గత రాత్రి నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో కచేరి జరుగుతుండగా దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 115 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
సిటీ హాల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, ఈ మాస్కో ఉగ్రదాడితో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
Also Read: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుల కుటుంబ సభ్యులకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని విధాలుగా రష్యాకి సహకరిస్తామని భరోసా కల్పించారు.