Moscow Attack: మాస్కో ఉగ్రదాడి ఘటనలో 11 మంది అరెస్ట్

మాస్కో ఉగ్రదాడితో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాన్సర్ట్‌ హాల్‌పై జరిగిన దాడిలో 115 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Moscow Attack: మాస్కో ఉగ్రదాడి ఘటనలో 11 మంది అరెస్ట్

Moscow Attack: రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో ఒక్కాసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. గత రాత్రి నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో కచేరి జరుగుతుండగా దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 115 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.


సిటీ హాల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, ఈ మాస్కో ఉగ్రదాడితో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Also Read: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!

అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.  బాధితుల కుటుంబ సభ్యులకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని విధాలుగా రష్యాకి సహకరిస్తామని భరోసా కల్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు