Gunti Nagaraju: సోషల్ మీడియాలో రీల్స్, డాన్స్ వీడియోస్, వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అయిన యు ట్యూబర్ గుంటి నాగరాజు ఖమ్మం నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నామినేషన్ వేశారు. విజిల్ గుర్తుకు ఓటు వేయండి అంటూ ఖమ్మంలో గుంటి నాగరాజు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గుంటి నాగరాజుకు యు ట్యూబ్ లో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ప్రచారానికి సంబంధించిన ప్రతీ వీడియోలను యు ట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తూ వినూత్నంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
తాజాగా గుంటి నాగరాజు.. "ప్రచారం ఆపేయమని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని" తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గుంటి నాగరాజు.. 'నేను నామినేషన్ వేయడం తప్పా? ఒక రైతు బిడ్డగా సామాన్యులకు సహాయం చేయాలని నామినేషన్ వేశాను. అర్థరాత్రి ఫేక్ కాల్స్ చేసి నామినేషన్ వెనక్కు తీసుకోమని బెదిరిస్తున్నారు. ఒక రైతు బిడ్డ గెలవాలని.. నేను ఎన్నికల్లో నిలబడ్డాను ఫ్రెండ్స్.. దయచేసి విజిల్ గుర్తుకు ఓటు వేయండి.. ఎవ్వరూ ఎంత ఫోర్స్ చేసినా.. బెదిరించినా.. తిట్టినా నేను మాత్రం ఎన్నికల నుంచి తప్పుకోను.. కాల్స్ చేస్తున్న వాళ్లు ఇతర పార్టీల వాళ్లా? ఫేక్ కాల్సా? అనేది తెలియడం లేదు..' అంటూ ఏడుస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.
యు ట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నీ ప్రయత్నం ఆపకు అని కామెంట్ చేస్తే.. మరి కొంత మంది నీకు డిపాజిట్ కూడా రాదు.. లైట్ తీసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
"ప్రచారం ఆపకు ....అన్నా....నువ్వు నిజాయితి పరునివి, ఏదోకరోజు నువ్ MLA అవుతావు అన్న అవుతావు",
"ఒక ఆడ పిల్ల నీ లాగానే నామినేషన్ వేసి ధైర్యంగా ప్రచారం స్టార్ట్ చేసింది". ఆమె ఎవరో కాదు బర్రెలక్క.. నాగర్ కర్నూల్ జిల్లా.. ఏడవకు ధైర్యంగా పోరాడు ఆల్ ది బెస్ట్",
"ఎవరు బెదిరించిన తగ్గేది లేదు అన్నకు సపోర్ట్ గా.. మేమున్నాం మేము వస్తాం"
"గుంటి.. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఓట్ల కోసం ట్రై చెయ్యి. అంత పెద్ద పార్టీ లు ఉండగా నీకు డిపాజిట్ కూడా రాదు. ఎక్కువగా ఆలోచించకు. లైట్ తేసుకో".
ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Chiranjeevi: త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!