Gaami Teaser: 'ఇదే నీ సమస్యకు పరిష్కారం'.. థ్రిల్లింగ్ గా విశ్వక్ సేన్ గామీ టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామీ. విద్యాధర్ కగిట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం గామీ టీజర్ రిలీజ్ చేసింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది.

New Update
Gaami Teaser: 'ఇదే నీ సమస్యకు పరిష్కారం'.. థ్రిల్లింగ్ గా విశ్వక్ సేన్ గామీ టీజర్

Gaami Teaser:  విద్యాధర్ కగిట దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గామీ. నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గామీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిలీజైన 6 గంటల్లోనే టాప్ 2 ట్రెండింగ్ గా సాగుతోంది.

గామీ టీజర్

ఇదే నీ సమస్యకు పరిష్కారం అనే డైలాగ్ తో ఓ మ్యాప్ చూపిస్తూ టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వచ్చారు. కొంత మంది నగ్నంగా స్నానం చేస్తూ వణికిపోతూ ఉంటారు. మరో వైపు నటి చాందిని కాశీలో ఫోటోలు తీస్తూ ఉండడం కనిపించింది. అంతా భయం భయంగా.. సస్పెన్స్ గా సాగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి శంకర్ అని పిలవగానే.. నల్ల దుప్పటి కప్పుకొని.. చేతిలో కర్రతో విశ్వక్ సేన్ లుక్ రివీల్ చేశారు. చివరిలో అఘోరగా విశ్వక్ ఇవన్నీ దాటడం.. నా వల్ల అవుతుందా అనే డైలాగ్ చెప్తాడు. టీజర్ ప్రకారం.. ఏదో సమస్యతో బాధపడుతున్న శంకర్.. మ్యాప్ ద్వారా పరిష్కారాన్ని కొనుగొనే ప్రయత్నమే ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థ్రిల్లర్ ను తలపించేలా ఉంది. మొత్తనికి ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ఆసక్తికరంగా సాగింది.

Also Read: Pushpa: తగ్గేదెలే.. పుష్ప పార్ట్ 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

publive-image

కార్తీక్ శబరీష్ సెల్యులాయిడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందిని, అభినయ, మహ్మద్ సమద్, హారిక, K R ఉన్నికృష్ణన్, దయానంద్ రెడ్డి, శాంతి రావు, బొమ్మ శ్రీధర్, సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ కు ఆహ్వానం.. ‘పుష్ప’ స్పెషల్ స్క్రీనింగ్

Advertisment
తాజా కథనాలు