Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌!

జనవరి  2024 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌ లైన్‌ లక్కీడీప్‌ కోసం అక్టోబర్‌ 18 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్‌ 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

New Update
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే!

TTD Arjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD)  దేవస్థానం ఓ గుడ్‌ న్యూస్ చెప్పింది. జనవరి(January) 2024 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌ లైన్‌ లక్కీడీప్‌ కోసం అక్టోబర్‌ 18 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్‌ 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

వర్చువల్ సేవా (Virtual Seva Tickets) టికెట్లను అక్టోబర్‌ 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం,గదుల కోటాను అక్టోబర్‌ 23 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

Also read: షుగర్‌ ఉందని విమానం నుంచి దింపేశారు!

లక్కీడీప్‌ లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్‌ 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు దానికి సంబంధించిన రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ వివరించింది. ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , కల్యాణోత్సవం టికెట్లను అక్టోబర్‌ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

అక్టోబర్ 23 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. స్పెషల్ దర్శనం రూ.300 టికెట్లను అక్టోబర్‌ 24 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ వసతి గదుల బుకింగ్‌ కోసం అక్టోబర్ 25న విడుదల చేస్తారు.

ఇవి ఇలా ఉండగా.. డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు.. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి  ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.

Also read: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

Advertisment
తాజా కథనాలు