TTD: సీఎం చేతుల మీదుగా శ్రీనివాససేతు ప్రారంభోత్సవం.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు!

తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాససేతు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ధర్మారెడ్డి. ఇక సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులు వేచి ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

TTD: సీఎం చేతుల మీదుగా శ్రీనివాససేతు ప్రారంభోత్సవం.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు!
New Update

Tirumala Brahmotsavam: శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్‌ 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్‌ 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.



టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏం అన్నారంటే:

• శాంతి భద్రతా చర్యలు నిర్వహణ పూర్తి బాధ్యత తిరుపతి ఎస్పీ పరిధిలో ఉంటుంది

• కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుంది

• భక్తులు వేచి ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు

• ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

• గరుడసేవ రోజు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలు రద్దు

• బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు అన్ని వెసులుబాటు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

• 9 రోజుల పాటు 24 గంటల పాటు తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు

• ఉదయం 8 నుంచి 10 గంటలకు, రాత్రి 7 నుండి‌ 9 గంటల మధ్య స్వామివారి వాహనసేవలు

• ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతా

• తిరుపతిలో పలు ప్రాంతాల్లో పోలీసు సెక్యూరిటీ చెక్ పోస్ట్‌లు



సీఎం చేతుల మీదుగా:

సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాససేతు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ధర్మారెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంత ప్రజలకు బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు వెయ్యిమందికి దర్శనం కల్పిస్తామన్నారు. క్రూరమృగాల సంచారం దృష్ట్యా నడకదారులు, ఘాట్ రోడ్లలో నిబంధనలు కొనసాగుతాయన్నారు. అటవీశాఖ చెప్పిన తర్వాత రూల్స్‌ సడలిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇటివలి ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుతపులి దాడికి చనిపోయింది. ఆ తర్వాత నుంచి భక్తుల్లో భయం నెలకొంది. ఆలిపిరి నడకమార్గం ద్వారా వెళ్లాలంటేనే భక్తులు హడలిపోతున్నారు. రెండు నెలల క్రితం కూడా కౌశిక్‌ అనే బాలుడిని చిరుతపులి గాయపరిచింది. అప్పటినుంచి చిరుతపులలను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తోంది. లక్షిత మృతి తర్వాత చర్యలను వేగవంతం చేసింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంచి బోనులను తెప్పించుకుంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు చిరుతపులు బోనులో చిక్కాయి. ఇక భక్తులు భయపడాల్సిన అవసరం లేదని.. చిరుతపులుల బెడద లేనట్టేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: భక్తుల కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.. టీటీడీకి హైకోర్టు ఆదేశం

#tirumala-brahmotsavam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe