Happiness: ఎవరితోనూ పనిలేదు.. ఇవి పాటిస్తే మీ లైఫ్‌ అంతా హ్యాపీనే.

జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఇతరుల నుంచి కొన్ని విషయాలు ఆశించకూడదు. అందరూ మీతో ఏకీభవిస్తారని అనుకోవద్దు. ఇతరులు మారాలని ఆశించడం మానేయండి. మీ హ్యాపినెస్‌ కోసం ఇతరులపై ఆధారపడటం మానేయండి. మీతో సహా ఎవరూ పరిపూర్ణులు కాదన్న విషయాన్ని గ్రహించండి.

Happiness: ఎవరితోనూ పనిలేదు.. ఇవి పాటిస్తే మీ లైఫ్‌ అంతా హ్యాపీనే.
New Update

Happiness: ప్రతీ ఒక్కరు వారి జీవితంలో తమకు  సొంతం అనుకున్న వారి పై కొన్ని ఆశలు, అంచానాలు పెట్టుకుంటారు.  అది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, కో వర్కర్ ఇలా ఎవరైనా కావచ్చు. తమకు ఇష్టమైన వారు వాళ్లకు నచ్చినట్లు, అనుగుణంగా వాళ్ళను అర్థం చేసుకోవాలని , ప్రేమించాలని, సపోర్ట్ చేయాలనీ ఆశిస్తారు. ఇవి జరగనప్పుడు బాధ, కోపం, చిరాకుతో నిరాశ చెందుతారు. అందుకని జీవితంలో ఎదుటి వారి నుంచి ఈ విషయాలను అయితే అస్సలు ఆశించకూడదు. అవేంటో తెలుసుకోండి.

ఎదుటి వారి నుంచి ఆశించకూడని విషయాలు 

మీ ఆలోచనలను ఎదుటి వారే అర్థం చేసుకోవాలనుకోవడం మానేయండి .

మనం ప్రేమించే వారు మనకు ఎంత దగ్గరైన సరే.. మనం చెబితేనే మన ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. మనం చెప్పకుండా.. ఎదుటి వారే మన అవసరాలు, ప్రాధాన్యతలు, కోరికలు, ఎమోషన్స్ తెలుసుకోవాలని ఆశించకూడదు. ఏదైనా సరే చెబితేనే తెలుస్తుంది.

మనతో అందరు ఏకీభవించాలని ఆశించకూడదు 

ప్రతీ ఒక్కరికి వాళ్ళ సొంత నిర్ణయాలు, అభిప్రాయాలు, విలువలు, నమ్మకాలు ఉంటాయి. అందరి అభిప్రాయాలు మన అభిప్రాయంతో కలిసే అవకాశం ఉండదు. ఎదుటివారి అభిప్రాయాలను, నిర్ణయాలను కూడా గౌరవించాలి. నీ నమ్మకాలు, అభిప్రాయాలు ఒప్పుకోనప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎదుటి వారి పాయింట్స్ కూడా విని.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

మన కోసం ఎదుటి వారు మారాలి అనుకోవడం మానేయాలి

మనకు ఇష్టమైన వాళ్లు మన కోసం వారి అలవాట్లు, నమ్మకాలు, కోరికలు, ప్రవర్ధన, మార్చుకోవాలని ఆశించకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి అప్పుడే లైఫ్ లో సంతోషంగా ఉంటాము. మనం ఆశించినట్లు జరగనప్పుడు నిరాశ చెందుతాము. అందుకే ఎదుటి వారు మనకు నచ్చినట్లు ఉండాలి అనుకోవడం మానేయాలి.

ఎదుటివారి పై ఆధార పడడం మానేయాలి

జీవితంలో మన సంతోషానికి, బాధకు మనమే బాద్యులము. మన ఆలోచనలు, ఒక విషయాన్నీ అర్థం చేసుకునే తీరు పై మన సంతోషం ఆధారపడి ఉంటుంది. మానసికంగా, ఎమోషనల్ గా ఎదుటి వారి పై ఆధారపడడం, వారి నుంచి సపోర్ట్ ఆశించడం మానేయండి. కొన్ని పరిస్థితల్లో మనకు కావాల్సిన వారి సపోర్ట్ అవసరం కానీ అన్ని విషయాల్లో కాదు. ఎప్పుడైనా సరే ఎదుటివారు మన కోసం ఏదైనా చేయాలి, మన ఆలోచనలే అర్థం చేసుకోవాలి, మనకు నచినట్లే ప్రవర్తించాలి అనుకోవడం నిరాశనే కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి.

Also Read: Morning Tips : ఉదయం బద్ధకంగా పడుకుంటున్నారా.. ఈ టిప్స్ తో మీ బద్ధకానికి చెక్..!

#things-do-not-expect-from-others
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe