ఈ లక్షణాలుంటే నోటి క్యాన్సర్ పక్కా..!

ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్ ఏదైనా ప్రారంభ దశలో పసిగట్టగలిగితే దానిని నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలుంటే నోటి క్యాన్సర్ పక్కా..!
New Update

క్యాన్సర్.. సమాజంలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న జబ్బు. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్ ఏదైనా ప్రారంభ దశలో పసిగట్టగలిగితే దానిని నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్లి చూపించుకోవడం ద్వారా గుర్తించవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం మనం నోటి క్యాన్సర్ గురించి, నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాల గురించి తెలుసుకుందాం. నోటి క్యాన్సర్ మొదట నోటి లోపల లేదా పై భాగంలో పుండ్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత నోటి లోపల నాలుకపై తెల్లని మచ్చల రూపంలో పుండ్లుగా కనిపిస్తాయి. అలా నాలుకపై తెల్లని మచ్చల రూపంలో పుండ్లు కనిపించాయంటే నోటి క్యాన్సర్ గా అనుమానించాలి.

క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా చెబుతారు. నోటి క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం కష్టంగా ఉంటుంది. నోటి క్యాన్సర్ కారణంగా నోటి లోపల దంతాలు బాగా వదులైపోతాయి. నోటి లోపల గడ్డలుగా కనిపించడం ప్రారంభిస్తాయి. నోటి క్యాన్సర్ కారణంగా చెవిలో నొప్పి, ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో కష్టం కలుగుతుంది. నోటి క్యాన్సర్ ముదిరితే కనీసం తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది. నోటి క్యాన్సర్ మొదట దంతాల చుట్టూ చిగుళ్ల వాపు లాగా వస్తుంది. దవడ చుట్టూ పుండ్లు కూడా నోటి క్యాన్సర్ కు కారణం అవుతాయి. నోరు శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి క్యాన్సర్ ఉన్నవారికి నోరు దుర్వాసన వస్తుంది.

కాబట్టి నోటికి సంబంధించి వచ్చే చిన్న చిన్న సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అవి అతి ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ కు కారణమై చివరకు ప్రాణాలను తీసే ప్రమాదం ఉంది. అందుకే ఆదిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యులను సంప్రదిస్తే తీవ్ర ప్రభావం నుండి బయటపడవచ్చు .

#oral-cancer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe