Nagar Kurnool: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: వంశీకృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.

Nagar Kurnool: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: వంశీకృష్ణ
New Update

ప్రజలు నలిగిపోతున్నారు

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool) కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం (Media conference) లో ఆయన ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేష్టలతో అచ్చంపేట ప్రజలు నలిగిపోతున్నారని విమర్శించారు. అచ్చంపేట ( Atchampeta) ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (MLA Guvwala Balraj) పై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.

This browser does not support the video element.

భయపడే పరిస్థితి

ఆయన ఒక ప్రజా ప్రతినిధి అనే విషయం మరిచి పోయి దౌర్జన్యపూరితం (Outrageous)గా, రౌడీయిజం ((rowdy sheet))తో వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇదేమి పద్ధతిని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో, ప్రజాభీష్టం మేరకు పని చేయాలి. అందరితో అన్యోన్యంగా ఉండాలి. కానీ ఎమ్మెల్యేని చూస్తే భయపడే పరిస్థితి అచ్చంపేటలో ఉందంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు.

also read: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

ఆయనపై రౌడీషీటర్ (rowdy sheet)  ఓపెన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ని చూస్తే ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారని కేసీఆర్ ఇలాంటి వారిని పెట్టుకొని ఏమి ప్రయోజనం అని నిలదీశారు. అచ్చంపేటలో ప్రజలు పాము పడగనిడలో బ్రతుకుతున్నామని భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో (upcoming elections ) ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలంటే ఓడించి తీరాలని  మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ  పిలుపునిచ్చారు.

also read: చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది: నాదెండ్ల మనోహర్

#a-rowdy-sheet #opened-immediately #against #mla-guvwala-balraj #mla-dcc-president-vamsikrishna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe