ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 70 లక్షలు

హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని రేపు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 70 లక్షలు ఆదాయం వచ్చిందని ప్రకటించారు.

Khairatabad Ganesh
New Update

Khairatabad Maha Ganapathi: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 70 ఏళ్ళ నుంచి వినాయకుడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏడాదీ ఒక్కో అడుగూ పెంచుకుంటూ..ఈ సారి 70 అడుగుల మహాణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు నిర్వాహకులు. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి జనాలు లక్షల్లో వస్తారు. ప్రతీరోజూ ఇక్కడ క్యూల్లో జనాలు ఉంటూనే ఉంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటూ మహాగణపతిని ఉంచుతారు. ఈ లెక్క ప్రకారం రేపటితో గణేష్ నవరాత్రులు ముగియనున్నాయి. రేపే మొత్తం ట్విన్ సిటీస్‌లో ఉన్న వినాయకుళ్ళను నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని కూడా హుస్సేన్ సాగర్‌‌కు చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు నిర్వాహులు.

మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు నిర్వాహకులు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. మొదటిసారి ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. పది రోజుల్లో ఇంత ఆదాయం వచ్చిందని చెప్పారు.

మరోవైపు ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలను బాలాపూర్ గణేశ్ కమిటీ ప్రవేశపెట్టింది. ప్రతీ ఏడాది బాలాపూర్ లడ్డు కొనుగోలు చేసుకోవాలి అని అనుకునే బయట వారు ముందుగా గత ఏడాది కొనుగోలు చేసిన డబ్బులను ముందుగా చెల్లించి వేలంలో పాల్గొనే వారు. కాగా ఈసారి ఈ పద్ధతిలో స్వల్ప మార్పులు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. ఈ ఏడాది నుంచి స్థానికులు కూడా మునుపటి ఏడాది లడ్డూ విలువను ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకున్న తర్వాతే వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకుంది. కాగా.. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షల రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. 1994నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాటకొనసాగుతోంది. మొట్టమొదట ఇది 450 రూ. లతో ప్రారంభమై ఇప్పుడు 27 లక్షలకు వచ్చింది. ఈసారి కూడా వేలం పాట వేయనున్నారు. రేపు గణేశుడిని నిమజ్జానానికి తీసుకెళ్ళే ముందు వేలం పాట వేస్తారు. ఉదయం 9.30 గంటలకు వేలంపాట ప్రారంభం కానుంది. 11 గంటలకు ట్యాంక్‌ బండ్‌ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Also Read:  Delhi: రేపు ఆప్ శాసనసభా పక్షం సమావేశం…కొత్త సీఎం ఎవరో?

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe