Arekapudi: కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. ఏం జరగబోతోందని హైటెన్షన్!

TG: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారి తీశాయి. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ బయల్దేరారు. కాగా అక్కడి ఏం జరగబోతోందనే అంశంపై హైటెన్షన్ నెలకొంది.

author-image
By V.J Reddy
Arekapudi Gandhi
New Update

Arekapudi Gandhi: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ముదిరాయి. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ బయల్దేరారు. అరికెపూడి ఇంటికొచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 11 గంటలకు అరికెపూడి ఇంటికెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పగా... కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే 12 గంటలకు అతని ఇంటికి వెళ్తానని అరికెపూడి అన్నారు. తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం అరికెపూడి ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానని కౌశిక్‌ రెడ్డి చెప్పారు.

చీర, గాజులు అంటూ..

కాంగ్రెస్ లో చేరానని గాంధి యే స్వయంగా మీడియా కు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని అన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. అరికేపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు.



కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. అరికేపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీర, గాజులు గిఫ్టుగా పంపుతున్న, ఇవి వేసుకుని తిరగండి అంటూ విమర్శలు గుప్పించారు.

వెయ్యి కార్లతో వెళ్తానంటూ కౌశిక్‌ రెడ్డి..

ఇదిలా ఉంటే.. అరికెపూడి ఇంటికొచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 11 గంటలకు అరికెపూడి ఇంటికెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పగా… కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే 12 గంటలకు అతని ఇంటికి వెళ్తానని అరికెపూడి అన్నారు. తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం అరికెపూడి ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానని కౌశిక్‌ రెడ్డి చెప్పారు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe