Telangana polls: టీ.బీజేపీ నుంచి అసెంబ్లీ టికెట్ కావాలా? ఇవాళ్టి నుంచి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు!

తెలంగాణలో కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ అడుగులేస్తోంది. అసెంబ్లీ సీటు ఆశిస్తున్న వారిని అప్లై చేసుకోవాలని కోరుతోంది. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఈ నెల 10వరకు కొనసాగనుంది. ఈ నెలాఖరులోపు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించి, అభ్యర్థులను ఖరారు చేసి వారి పేర్లను ప్రకటిస్తుందని సమాచారం.

BJP: చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం బీజేపీలో లొల్లి..
New Update

BJP Invites Applications from Assembly Ticket Aspirants: తెలంగాణ(telangana)లోని 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించనుంది బీజేపీ(BJP). బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(congress)తో కంపేర్ చేస్తే బీజేపీ ఆలస్యం అయినప్పటికీ, టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ టైమ్‌లైన్‌ను సెట్ చేసింది. సెప్టెంబరు 4(ఇవాళ్టి) నుంచి సెప్టెంబర్‌ 10 వరకు టికెట్ల కేటాయింపునకు దరఖాస్తులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్‌(Hyderabad)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఏడు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.



అబ్బో ఇంత టైమా?

తెలంగాణ బీజేపీ నుంచి అసెంబ్లీ సీట్‌కి పోటి చేయలనుకునే అభ్యర్థులు అప్లికేషన్‌ విషయంలో కాస్త ఎఫెర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫారమ్‌ ఫిల్ చేయడానికే ఒకటి రెండు రోజులు పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు రాజకీయపరంగా ఏ చిన్న విషయాన్ని దాచిపెట్టకుండా ఫారమ్‌ నింపాల్సి ఉంటుంది. బీజేపీలో ఎప్పటినుంచి యాక్టివ్‌గా ఉంటున్నారు.. గతంలో పోటి చేశారా? ఒకవేళ పోటి చేసి ఉంటే ఎన్ని ఓట్లు పడ్డాయి..? ప్రజల కోసం ఏం ఏం చేశారు..? ఇప్పటివరుక ఎలాంటి పోరాటాల్లో పాల్గొన్నారు.. వాటికి సంబంధించి పేపర్ క్లిప్పింగ్‌లు ఉన్నాయా..? గెలిస్లే ఏం చేస్తారు లాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కేవలం అప్లికేషన్‌ చూసే మొత్తండి డిసైడ్ అవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అంటే క్రాస్‌ చెకింగ్‌ కూడా ఉండవచ్చు కానీ అప్లికేషన్‌ మాత్రం మొత్తం నింపాల్సిందే!



బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు:

అటు బీజేపీ కంటే కాస్త ముందుగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌. కేసీఆర్‌ పార్టీ అయితే ఏకంగా అభ్యర్థులనే ప్రకటించేసింది. తెలంగాణలోని 119 స్థానాలకు 115 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను తొలిసారిగా ప్రకటించింది. అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికను ప్రారంభించింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) టికెట్ ఆశించిన వారి నుంచి 1,000 కంటే ఎక్కువ దరఖాస్తులను పరిశీలించింది. ఈ ప్రక్రియను ప్రారంభించడం ఇప్పుడు బీజేపీ వంతు. మెజారిటీ స్థానాల నుంచి పోటీ చేయడానికి బలమైన నాయకులు లేని కాషాయ పార్టీ.. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు టిక్కెట్ల కేటాయింపు కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అయితే దరఖాస్తుదారుల నుండి రూ. 50,000 నాన్-రిఫండబుల్ ఫీజు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25,000) వసూలు చేసిన కాంగ్రెస్‌లా కాకుండా, బీజేపీ ఎలాంటి రుసుము వసూలు చేయడంలేదు. నెలాఖరులోపు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించి, అభ్యర్థులను ఖరారు చేసి వారి పేర్లను ప్రకటిస్తుందని సమాచారం.

కీ పాయింట్స్:

➼ ఎంపీలందరూ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి భవితవ్యం తేల్చుకోవాలని తేల్చి చెప్పిన బీజేపీ అధిష్టానం..

➼ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సుముఖంగా లేని కొత్త మంది నేతలు

➼ ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేతలు అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తులు పెట్టుకుంటారా లేదా అనేది ఆసక్తి..

ALSO READ: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..?

#telangana-assembly-elections-2023 #telangana-bjp-shortlist
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe