TSPSC Group-1: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టులో విచారణ.. కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈ రోజు విచారణకు చేపట్టింది న్యాయస్థానం. పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రశ్నించింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

New Update
TSPSC Group-1: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టులో విచారణ.. కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను (Group-1 Exam) రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ (TSPSC) డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈ రోజు విచారణ చేపట్టింది న్యాయస్థానం. పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రశ్నించింది. మీరే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది ధర్మాసనం. ఒకసారి పేపర్‌ లీక్‌, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య అంటూ.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ తీవ్ర వాఖ్యలు చేసింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

గతేడాది అక్టోబర్ 16న తొలిసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ ను నిర్వహించగా పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. అనంతరం జూర్ 11న మరో సారి పరీక్షను నిర్వహించింది. అయితే.. పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల హాజరు తీసుకుంటామని నోటిఫికేషన్లో పేర్కొన్న టీఎస్పీఎస్సీ.. రెండో సారి పరీక్ష నిర్వహించే సమయంలో ఆ నిబంధనను అమలు చేయలేదు. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు హైకోర్టు సింగిల్ బెంచ్. నిబంధనలు పాటిస్తూ మరో సారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పరీక్షకు హాజరైన 2.30 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాయాల్సి వచ్చిందని.. మళ్లీ ఎగ్జామ్ అంటే ఎలాగని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్ష రెండో సారి రద్దు కావడంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం గ్రూప్-1 రద్దు విషయమై టీఎస్పీఎస్సీ, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Ganesh Nimajjanam 2023: అక్కడే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం.. ప్రభుత్వానికి రాజాసింగ్ సంచలన వార్నింగ్

Advertisment
తాజా కథనాలు