RS SHIVAJI: ప్రముఖ నటుడు శివాజీ కన్నుమూత

తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్‌ఎస్‌ శివాజీ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

RS SHIVAJI: ప్రముఖ నటుడు శివాజీ కన్నుమూత
New Update

తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్‌ఎస్‌ శివాజీ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శివాజీ మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కేవలం నటుడిగానే కాకుండా అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సౌండ్‌ డిజైన్‌, లైన్‌ ప్రొడక్షన్‌ విభాగాల్లోనూ శివాజీ సత్తా చాటారు.

తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచతమే. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో కానిస్టేబుల్‌ మాలోకం పాత్ర పోషించారు. అందులో నేను ఎక్కడికో వెళ్లిపోతున్నా అని ఆయన చెప్పిన డైలాగ్‌ బాగా ఫేమస్ అయింది. ఇక తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్‌ సినిమాల్లో శివాజీ ఎక్కువగా నటించారు. అపూర్వ సహోదరులు, మైఖేల్‌ మదన కామరాజు, గుణ, భామనే సత్యభామనే, సత్యమే శివం వంటి సినిమాల్లో కనిపించారు. అలాగే విక్రమ్‌ సినిమాలోనూ చిన్న పాత్ర చేశారు. సూర్య నటించిన ఆకాశమే హద్దుగా మూవీలోనూ కనిపించారు. హీరోయిన్ సాయిపల్లవి మెయిన్ లీడ్‌లో నటించిన గార్గి సినిమాలో ఆమెకు తండ్రిగా నటించారు. ఇక కమెడీయన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన లక్కీ మ్యాన్‌లో చివరిగా నటించారు. నిన్ననే(సెప్టెంబర్‌ 1) ఈ సినిమా రిలీజ్ అయింది.

శివాజీ కుటుంబ సభ్యులందరూ తమిళ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన సోదరుడు సంతాన భారతి నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ పనిచేశారు. శివాజీ తండ్రి ఎంఆర్ సంతానం కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇటీవల సీనియర్ నటుడు వడివేలు సోదరుడు జగదీశ్వరన్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe