D. Srinivas: డీఎస్‌ మృతిపట్ల రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

D. Srinivas: డీఎస్‌ మృతిపట్ల రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సంతాపం
New Update

D. Srinivas: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని....తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

సీఎం రేవంత్ సంతాపం.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

#d-srinivas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe