Ravi Teja: రవితేజకు ఏమైంది..మోకాలికి 12 కుట్లు..!!

టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో హీరో రవితేజ గాయపడ్డాడు. మోకాలికి 12 కుట్లు పడ్డాయి. ట్రైన్ దోపిడీ సీన్‌లో అదుపుతప్పి కిందపడిన రవితేజ..మళ్లీ రెండు రోజులకే షూటింగ్‌కు వచ్చారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా రవితేజ వినలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు రవితేజ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ravi Teja: రవితేజకు ఏమైంది..మోకాలికి 12 కుట్లు..!!
New Update

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో  తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి ఆపరేషనై 12 కుట్లు పడ్డాయని నిర్మాత అభిషేక్ అగర్వాల్ వివరించారు. ట్రైన్ దోపిడీ సీన్‌లో అదుపుతప్పి కిందపడిన రవితేజ..మళ్లీ రెండు రోజులకే షూటింగ్‌కు వచ్చారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా రవితేజ వినలేదని చెప్పుకొచ్చారు. దీంతో రవితేజ డెడికేషన్ పై సర్వత్ర ప్రశంసలు వినిపిస్తున్నాయి.

రవితేజ హీరోగా దర్శకుడు వంశీ కాంబనేషన్‌లో రూపొందిన యాక్షన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలోని ట్రైన్ దోపిడీ సీన్‌లో ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారు. మోకాలికిపైన బాగా దెబ్బ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మోకాలికి ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు వైద్యులు. అయితే కేవలం రెండే రెండు రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్ కు వచ్చారు.

publive-image

ఆ షాట్‌లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, కాబట్టి షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని భావించిన రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారట. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినలేదని, సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావానికి అది నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు రవితేజ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

publive-image

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానయికలుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీశర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Also Read: అయ్యయ్యో .. అక్కడ ఆడిషన్స్ కు వెళ్తున్న మంచు లక్ష్మి..!!

#tiger-nageshwar-rao #raviteja
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe