Rahul murder in gym cellar: జిమ్ సెల్లార్ లో రాహుల్ మర్డర్..మామూలుగా ట్విస్ట్ లు లేవుగా.. ప్రేమ వ్యవహారమే!!

రాహుల్ సింగ్ ఇంకా ఓ అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే ఏమైందో ఏమో.. కాని ఇద్దరి మధ్య బ్రేక్ పడింది. దీంతో ప్రేయసీని పక్కన పెట్టి రాహుల్ కొన్ని రోజుల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాని రెడీ అయ్యాడు. దీంతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ విషయంలో రాహుల్ ఇంకా అతడి ప్రేయసీ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే ప్రేయసీ ఇంకా ఆమె తల్లి కలిసి రాహుల్ సింగ్ ను ఓ జాదుఘర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో మధ్యవర్తిత్వం వహించిన జాదుఘర్ మ్యాటర్ సెటిల్ చేస్తానని మాయమాటలు చెప్పి రాహుల్ దగ్గరి నుంచి 4 లక్షలు ఇంకా బంగారు ఆభరణాలు తీసుకున్నాడు...

New Update
Rahul murder in gym cellar: జిమ్ సెల్లార్ లో రాహుల్ మర్డర్..మామూలుగా ట్విస్ట్ లు లేవుగా.. ప్రేమ వ్యవహారమే!!

Rahul murder in gym cellar: రాజేంద్రనగర్ లో ఓ జిమ్ సెంబర్లో యువకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే యువకుడి హత్య వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది.

ఇక వివరాల్లోకి వెళితే.. హైదర్ గూడ పిల్లర్ నెంబర్ 126 దగ్గర సెలబ్రిటీ జిమ్ ఉంది. అందులో ఈవెనింగ్ వందల మంది జిమ్ చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే మణికొండ పుప్పాలగూడకు చెందిన రాహుల్ సింగ్ అనే యువకుడు కూడా కొన్నాళ్లుగా అక్కడే జిమ్ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిమ్ కి వచ్చాడు. ఇక వ్యాయామం ముగించుకొని సెల్లార్లో ఉన్న తన బైక్ దగ్గరికి వచ్చాడు.

ఇక అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దుండగులు అతనిపై ఒక్కసారిగా కత్తులతో తెగబడ్డారు. విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. కనురెప్పపాటులో ఇదంతా జరిగిపోగా.. దుండగులు  అక్కడి నుంచి ఉడాయించారు. ఇక జిమ్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని రాహుల్ డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు రాహుల్ కుటుంబ సభ్యులు కూడా వెంటనే జిమ్ దగ్గరికి చేరుకున్నారు. రాహుల్ మృతదేహాన్ని చూసి వారి రోదనలు మిన్నంటాయి.

మర్డర్ వెనుక ప్రేమ వ్యహారమే కారణం..!

అయితే మణికొండ నివాసి అయిన రాహుల్ రాజేంద్ర నగర్ కు ఎందుకు జిమ్ కు వస్తున్నాడు.. మణికొండలోనే చాలా జిమ్ లు ఉండగా.. ఇక్కడికే ఎందుకు రావాల్సి వచ్చింది... ఇక ఆ యువకుడి పై ఎవరు దాడి చేశారు.. రాహుల్ ను మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది... ఎందుకు చంపారనే యాంగిల్ లో పోలీసులు ఇన్వెష్టిగేషన్ చేస్తున్నారు.అయితే ప్రాథమికంగా రాహుల్ సింగ్ దారుణ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదంతా ప్రేయసీ, ఆమె తల్లి ప్లానేనా..!

రాహుల్ సింగ్ ఇంకా ఓ అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే ఏమైందో ఏమో.. కాని ఇద్దరి మధ్య బ్రేక్ పడింది. దీంతో ప్రేయసీని పక్కన పెట్టి రాహుల్ కొన్ని రోజుల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాని రెడీ అయ్యాడు. దీంతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ విషయంలో రాహుల్ ఇంకా అతడి ప్రేయసీ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే ప్రేయసీ ఇంకా ఆమె తల్లి కలిసి రాహుల్ సింగ్ ను ఓ జాదుఘర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో మధ్యవర్తిత్వం వహించిన జాదుఘర్ మ్యాటర్ సెటిల్ చేస్తానని మాయమాటలు చెప్పి రాహుల్ దగ్గరి నుంచి 4 లక్షలు ఇంకా బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.

అయితే తాను మోసపోతున్నానని గమనించిన రాహుల్ జాదుఘర్ కు తన డబ్బులు వాపస్ ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 24 న జాదుఘర్ ఇంకా రాహుల్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే తన డబ్బులు ఇంకా బంగారు నగలు తిరిగి ఇవ్వాలని రాహుల్ జాదుఘర్ కు డెడ్ లైన్ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జాదుఘర్ రాహుల్ ను మర్డర్ చేయాలని ప్లాన్ వేశాడు. వేసిన స్కెచ్ ప్రకారం అజార్ అనే మరో వ్యక్తితో కలిసి జిమ్ దగ్గరికెళ్లి.. రాహుల్ మొహం మీద పెప్పర్ స్ప్రే చల్లి తరువాత దారుణంగా కత్తులతో మర్డర్ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

హైదరాబాద్ లో దారుణం..నవ వధువు కళ్లకు గంతలు కట్టి అత్యాచారానికి పాల్పడ్డ దొంగ బాబా!

Advertisment
తాజా కథనాలు