Pushpa Actor Jagadeesh: మహిళా వేధింపుల కేసులో.. 'పుష్ప' యాక్టర్ జగదీశ్ అరెస్ట్

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన సపోర్టింగ్ రోల్ లో నటించిన జగదీశ్ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మహిళ వేధింపులకు కారణమైన జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Pushpa Actor Jagadeesh: మహిళా వేధింపుల కేసులో..  'పుష్ప' యాక్టర్ జగదీశ్ అరెస్ట్
New Update

Pushpa Actor Jagadeesh: అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ పై కేసు నమోదైంది. గత నెల 27 న మహిళా జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్న ఫొటోలు తెలియకుండా తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాగుట్ట పరిదిలో నివాసం ఉంటున్న ఈ మహిళ మనస్తాపంతో ఈ నెల 29 న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్ట్ జగదీశ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Also Read: Naga Chaitanya: నాగచైతన్య లైన్ క్లియర్.. సమంత పరిస్థితేంటి?

మహిళ ఆత్మహత్య ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళతో జగదీశ్ కు సినిమా రంగంలో పరిచయం ఉన్నట్లు తెలిసింది. గత నెల 27న ఆ మహిళ మరో వ్యక్తితో ఉన్న ఫోటోలను చూపించి ఆమెను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ కేసులో కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న జగదీశ్ ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా ఎప్పుడంటే..!

#pushpa-actor-jagadeesh-arrest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe