Daggubati Purandeswari: RTVతో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మట్లాడారు. జనసేన NDAలో భాగస్వామి అని తెలిపారు. నిన్న వారి అభ్యర్థికి సైతం ప్రచారం చేసినట్లు వెల్లడించారు. జనసేనకు తాము సహకరిస్తున్నట్లు కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలి కోరారు. తెలంగాణలో నాయకులు మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైందని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాలు విషయంలో ఈ ప్రభుత్వం ఎం చేసిందో అందరికి తెలుసన్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు గమనించాలని సూచించారు.
ప్రజల పాలన కావాలా? స్వీయ పరిపాలన కావాలా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..అది బీజేపీ తోనే సాధ్యమని వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా పొత్తు ఉన్నది జనసేనతోనే అని తెలిపారు. మిగిలిన విషయాలు హై కమండ్ చూసుకుంటుందని పెర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఒక కమ్యూనిటీకి సంబంధించినట్టుగా ఉందని కామెంట్స్ చేశారు. భూములు కూడా అమ్ముతాం అంటున్నారని..అయితే, అది కరెక్ట్ కాదని హెచ్చరించారు.
Also Read: పువ్వాడా మజాకా.. మార్క్ ప్రచారంతో హోరెత్తిస్తున్న మంత్రి.. ఫోటోలు వైరల్..
కాగా, హోరాహోరీగా సాగుతోన్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి జనసేనాని పవన్ కల్యాణ్ ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో 3 సభలు, ఒక రోడ్ షోలో పవర్ స్టార్ పాల్గొననున్నారు. ఈ నెల 23న బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్, కొత్తగూడెం నియోజకవర్గాల సభల్లో ఆయన పాల్గొంటారు. 25న తాండూర్ లో ప్రచారం చేస్తారు. అనంతరం ఈ నెల 26న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి కూకట్ పల్లిలో రోడ్ షోలో పాల్గొంటారు పవన్. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 సీట్లను కేటాయించింది బీజేపీ.