Net Flix: ప్రముఖ ఓటీటీ వేదికల్లో ఒకటి నెట్ ఫ్లిక్స్. నెట్ ఫ్లిక్స్ సంస్థ మొదటి సారి తమ యూజర్ల కోసం.. నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే సినిమాలు, షోలు, సీరీస్ లు ఎంత మంచి చూస్తున్నారనే డేటాను ప్రపంచానికి తెలియజేసింది. ప్రతీ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ మిడ్ వ్యూవర్ షిప్ డేటాను విడుదల చేసేది. ఈ డేటా మొత్తం వ్యూవర్ షిప్ ఎంత అనేది రిపోర్ట్ ను తెలియజేస్తుంది. కానీ మొదటి సారి నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ వ్యూవర్స్, సప్లైయర్స్, కాంపిటీటర్స్ కోసం లోతైన పరిశీలనతో ఒక సెమియాన్యువల్ రిపోర్ట్ ను విడుదల చేసింది. దీంట్లో నెట్ ఫ్లిక్స్ యూజర్స్ అత్యధికంగా చూసిన షోస్ ఏంటీ అనేవి తెలియజేశారు. ఈ జాబితాలో అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమాలు ఇవే..
రానా నాయుడు
దగ్గుబాటి వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సీరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ లో 46,300,00 గంటల వ్యూవర్ షిప్ తో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ షో. నెట్ ఫ్లిక్స్ జాబితా ర్యాంకింగ్ లో 336 స్థానంలో ఈ షో ఉంది.
చోర్ నికల్ కే భాగ
చోర్ నికల్ కే భాగ సీరీస్ 41, 700,00 గంటల వ్యూవర్ షిప్ కలిగి.. ర్యాంకింగ్ లో 401 స్థానంలో ఉంది.
మిషన్ మజ్ను
మిషన్ మజ్ను సినిమా 31,200,00 గంటల వ్యూవర్ షిప్ తో ర్యాంకింగ్ జాబితాలో 3 స్థానంలో నిలిచింది.
శ్రీమతి ఛటర్జీ vs నార్వే
శ్రీమతి ఛటర్జీ vs నార్వే షో 29.600,000 వ్యూవర్ షిప్ తో ర్యాంకింగ్ జాబితాలో 651 స్థానంలో ఉంది.
క్లాస్
క్లాస్ సీరీస్ ఓటీటీ వేదిక పై అత్యంత ప్రజాదరణ పొందిన 5 వ షోగా 27,700,000 గంటల వ్యూస్ సాధించింది. ర్యాంకింగ్ జాబితాలో 651 స్థానంలో ఉంది.
తు ఝూతి మైన్ మక్కార్
తు ఝూతి మైన్ మక్కార్ సినిమా 44,06,00,000 గంటల చూసిన షోగా ర్యాంకింగ్ లిస్ట్ లో 6 వ స్థానంలో ఉంది.
షెహజాదా
హిందీ సినిమా షెహజాదా 24,800,000 గంటల వ్యూవర్ షిప్ తో 7వ స్థానంలో ఉంది.
Also Read: Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కష్టమేనా..?