NDA: ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు

ఏపీ సీఈఓ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. ప్రధాని పాల్గొన్న ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు చేసింది. ఎన్నికల విధుల నుంచి డీఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ, పల్నాడు ఎస్పీలను విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు.

NDA: ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు
New Update

NDA complains to CEO: ఏపీ సీఈఓ ఎంకే మీనాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన ప్రతినిధి బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ ప్రతినిధి పాతూరి నాగభూషణం నేతృత్వంలో ఎన్డీఏ బృందం భేటీ అయింది. ప్రధాని పాల్గొన్న ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు చేశారు. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్డీఏ ఫిర్యాదు చేసింది. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: కూటమి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. టీడీపీ జనసేన బీజేపీ కామన్ గా పోటీపడుతున్న స్థానాలు ఎంటో తెలుసా?

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినా కొందరు పోలీసులు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు. ప్రధాని సభ అనుకున్నారా..? దారిన పోయే దానయ్య సభ అనుకున్నారా..? ప్రధాని వస్తున్నారన్నా.. కనీస భద్రత కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు కంటే కానిస్టేబుల్ నయం అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల విధుల నుంచి డీఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ, పల్నాడు ఎస్పీలను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలు వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేయిస్తారని ఆరోపించారు.

Also Read: ‘గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు’.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!

బీజేపీ నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. ప్రధాని రిసీవింగ్ దగ్గర నుంచి పాసుల వరకు పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రధానికి ఙాపికలను ఇవ్వడానికి కూడా అనుమతివ్వలేదని ఫైర్ అయ్యారు. పల్నాడు ఎస్పీ తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే జనసేన బండ్రెడ్డి రామకృష్ణ  మాట్లాడుతూ.. ప్రధాని సభలో ప్రొటోకాల్ విఫలమయ్యారన్నారు. ఎన్నికల విధులు శాంతియుతంగా జరగాలంటే భద్రతా లోపాలకు కారణమైన ఉన్నతాధికారులను తప్పించాలని కోరారు. ప్రధాని సభకు భద్రతను దగ్గరుండి చూసుకోవాల్సిన పల్నాడు ఎస్పీ రాకపోవడమేంటీ..? అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

#nda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe