పురుషుల మొబైల్ లో దిశ యాప్ ఎందుకు? ఏదో స్కామ్ ఉందన్న లోకేష్.!

అనకాపల్లిలో జవాన్‌ పై దాడి ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై లోకేష్‌ సీరియస్ గా స్పందించారు. దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోందన్నారు. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు.

చంద్రబాబు పేరుతో లెటర్..లోకేష్ సంచలన వ్యాఖ్యలు.!
New Update

Lokesh Nara: అనకాపల్లి జిల్లాలో పోలీసులు ఓ దేశ సైనికుడితో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఏపీలో జవాన్‌ పై దాడి(ap police attack on jawan) ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయనపై దాడి చేయడం సిగ్గుచేటని  ప్రజలందరూ మండిపడుతున్నారు. తాజాగా, ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందించారు.

Also Read: ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు జవాన్ పై పోలీసుల దాడి.!

జవాన్ పై పోలీసులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు అలాంటిది మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు. మహిళలు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన దిశ యాప్ ను పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఇలా చేయడంపై  అనుమానాలకి తావిస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

#ap-police #police-attack-on-jawan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe