ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి దందాపై పోలీసులు (Telangana Police) ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 168 గంజాయి ప్యాకెట్లను (336 కేజీలు) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 84 లక్షల వరకు ఉంటుందని వివరించారు. నిందితుల వద్ద నుంచి ఒక డీసీఎం, మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు
గంజాయి రవాణాపై నల్గొండ ఎస్పీ చందనా దీప్తి ఉక్కుపాదం
నల్గొండ పోలీసులు ఎస్పీ చందనా దీప్తీ నేతృత్వంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.84 లక్షల విలువై 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
New Update
Advertisment