నా వెంట్రుక కూడా పీకలేరు.. బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టు ధిక్కరణ అంటూ నాకు నోటీసు ఇచ్చి మీరు చేసేదేముంది.. నా వెంట్రుక కూడా పీకలేరని నిప్పులు చెరిగారు.

TDP: కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్.. అధికారం కూటమిదే..  బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
New Update

Gorantla Butchaiah Chowdary: వైసీపీ ప్రభుత్వపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న నేరాలకు కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిస్తే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు.

రాష్ట్రంలో సీఐడీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలను బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. కోర్టు దిక్కరణంటూ నాకు నోటీసు ఇచ్చి మీరు చేసేదేముంది.. నా వెంట్రుక కూడా పీకలేరని నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబును సాక్షాధారాలు లేకుండా రిమాండ్ కు పంపించారని వ్యాఖ్యనించారు. మా కార్యకర్తలను కాపాడుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని ధీమ వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.

Also Read: నాయకులు అవినీతిలో కూరుకుపోయారు..పురందరేశ్వరి సంచలన వ్యాఖ్యలు.!

ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని కౌంటర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలు జగన్ గంగలో కలిపాడని విమర్శనాస్త్రాలు సంధించారు. సిఐడి పోలీసులు ఇస్తున్న నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ చెడ్డి గ్యాంగ్ పనిచేస్తోందని ఎద్దెవ చేశారు. ఆ చెడ్డి గ్యాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోందని విమర్శించారు. వైసీపీ రాక్షసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని పెర్కొన్నారు. సిఐడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు.

#mla-gorantla-butchaiah-chaudhary
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe