Miyazaki Mango: ఏమండోయ్..ఇది విన్నారా? ఒక్క మామిడి పండు 10 వేలు..ఏంటో అంత స్పెషల్..? 

కర్ణాటకలోని ధార్వాడ్ లో నిర్వహిస్తున్న మామిడి మేళాలో ఒక్క మామిడి పండు 10 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ కు చెందిన ‘మియాజాకి’ రకం మామిడి. దీనిని ప్రమోద్ గాంకర్ అనే రైతు తన తోటలో పండించారు. ఈ రకం చెట్టుకు 14 పండ్లు మాత్రమే కాస్తాయి. 

Miyazaki Mango: ఏమండోయ్..ఇది విన్నారా? ఒక్క మామిడి పండు 10 వేలు..ఏంటో అంత స్పెషల్..? 
New Update

Miyazaki Mango: కర్ణాటకలోని ధార్వాడ్ లో ప్రతి ఏటా మామిడి మేళా నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న మేళాలో  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకి మామిడి పండు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  ఇక్కడ ఒక పండు రూ. 10,000 కు అమ్మడం జరిగింది.  ఉద్యానవన శాఖ ఆవరణలో మంగళవారం ప్రారంభమైన మామిడి ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఫెయిర్‌లో ఈ మామిడి అందరి దృష్టిని ఆకర్షించింది.

Miyazaki Mango: కలకేరి మామిడి పండించే ప్రమోద్ గాంకర్ తోటలో పండిన మామిడి ఇది.  మామిడి మేళాలో ఈ రకం మామిడిని ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఇంత ఖరీదైన మామిడి పండ్లను కొనకపోయినా జనాలు మాత్రం వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. 

మామిడి రకాల్లో ఈ మియాజాకి మామిడి అత్యంత ఖరీదైనది. జపాన్ ఈ జాతిని పెంచుతోంది. ఈ మేళాలో  ఈ మామిడి పండు కిలో 2.7 లక్షలు.. ఒక పండు 10 వేల రూపాయలకు విక్రయించారు.

మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి జపాన్‌కు చెందిన మియాజాకి అనే రకం విత్తుని  తీసుకొచ్చినట్లు రైతు ప్రమోద గాంకర్ తెలిపారు. ఈ మియాజాకి రకం మామిడితో సహా 7 వేలకు పైగా మామిడి చెట్లను సాగుచేస్తున్నట్లు ఆ రైతు తెలిపారు.

Also Read: ఇరాన్ అధ్యక్షుడే కాదు మన వైఎస్ తో సహా చాలామంది..

Miyazaki Mango: ఈ రకం మామిడి చెట్టు స్థానిక వాతావరణానికి బాగా అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు. ఈ చెట్టు ఒక సీజన్‌లో గరిష్టంగా 14 ఫలాలను ఇస్తుంది. ఇటీవల పదుల సంఖ్యలో మామిడి పండ్లు సుమారు రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయాయి. అరుదైన పండు కావడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కావడంతో అత్యధిక ధర పలికిందని ఆ రైతు చెప్పారు. 

Miyazaki Mango: “ఈ మామిడి పండును కొప్పల్‌కు చెందిన వినియోగదారుడికి ఒక్కో పండు రూ.10 వేలకు విక్రయించాను. రాష్ట్రంలో కొద్దిమంది కొనుగోలుదారులు అందుబాటులో ఉన్నారు. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  విటమిన్ ఎ, బి - సి పుష్కలంగా ఉంటాయి.  ఈ పండు చర్మానికి కూడా మేలు చేస్తుంది.”అని రైతు వివరించారు.  అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఈ మామిడి చెట్టును పెంచుతున్న ప్రాంతాన్ని వెల్లడించలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర సాగుదారులకు అవగాహన కల్పించేందుకు జాతరలో పండును ప్రదర్శించామని చెప్పారు. 

#miyazaki-mango #mango
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe