Ragi Spinach Dosa: మిల్లెట్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వీటిలోని పోషకాలు, హై ఫైబర్ మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవన శైలీ వ్యాధులు ఉన్నవారికి ఇవి మరింత ఆరోగ్యకరం. సాధారణంగా జీవన శైలి వ్యాధులతో బాధపడే వారు తినే ఆహారం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కెలరీస్ తక్కువగా కలిగిన బ్రౌన్ రైస్, మిల్లెట్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. కావున ఇలాంటి సమస్యలు ఉన్నవారు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోసం రాగి స్పినాచ్ దోశ ట్రై చేయండి.
రాగుల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని హై ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే పాలకూరలోని పోషకాలు శరీరంలో చెడు కొవ్వులను తగ్గించి మంచి కొవ్వులను పెంచుతాయి.
రాగి స్పినాచ్ దోశకు కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి: 50 గ్రాములు, రాగి పిండి: 50 గ్రాములు, ఎగ్ వైట్, పాలకూర: 30 గ్రాములు, పసుపు పప్పు ( మూంగ్ దాల్ పప్పు) : 30 గ్రాములు, గ్రీన్ చిల్లీ: 2, కొత్తిమీర ఆకులు: 5 గ్రాములు, ఆయిల్ : 5 గ్రాములు, వాటర్: 1 కప్పు, సాల్ట్: కావల్సినంత
తయారీ విధానం
- ముందుగా బియ్యం పిండి, రాగి పొడిని ఒక బౌల్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక గుడ్డు తీసుకొని దాని ఎగ్ వైట్ మాత్రం వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి.
- ఇప్పుడు ఒక కప్పు నీళ్లలో నుంచి అర కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మిగతా అరకప్పు నీళ్లను బాగా మరిగించి కలపాలి.
దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అన్ని కలిసేలా మిక్స్ చేయండి. మరీ ఎక్కువ వాటరీ అయ్యేలా చేస్తే దోశ రాదు. అందుకే నీళ్ళు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. - ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ దోశ బ్యాటర్ దాని పాన్ వేసి రౌండ్ గా వేయాలి. టెస్ట్ కోసం ఆయిల్ వేసుకోవచ్చు.
Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!
స్పినాచ్ ఫిల్లింగ్ చేసే విధానం
- చిన్నగా కట్ చేసిన పాలకూర ముక్కలను స్టీమింగ్ పద్దతిలో కుక్ చేయాలి.
- ఇప్పుడు పప్పు, గ్రీన్ చిల్లీస్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో స్టీమ్ చేసుకున్న పాలకూరతో బాగా మిక్స్ చేయాలి.
- ఈ పేస్ట్ పాన్ పై ఉన్న దోశ మీద వేసి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. టేస్టీ హెల్తీ రాగి స్పినాచ్ దోశ రెడీ. అయితే స్పినాచ్ ఫిల్లింగ్ ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. వేడి వేడి దోశను కోకోనట్ చట్నీలో తింటే అదిరిపోతుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
Also Read: Back Acne: వీపు, బాడీ పై పింపుల్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!