Maloth Kavitha: మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితా!

మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితను కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు ముఖ్య నేతలతో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత అధికారిక ప్రకటన చేశారు. దీంతో కవితకు మరోమారు అవకాశం దక్కింది.

Maloth Kavitha: మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితా!
New Update

Maloth Kavitha as Mahabubabad MP Candidate: మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితను కేసీఆర్ (KCR) ప్రకటించారు. ఈ రోజు ముఖ్య నేతలతో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ (BRS) అధినేత అధికారిక ప్రకటన చేశారు. దీంతో కవితకు మరోమారు అవకాశం దక్కింది. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం ఆశించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావ్, ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు సిట్టింగ్ లనే వరించాయి.

అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి..

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమైన కేసీఆర్‌.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశానికి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరవగా వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: BREAKING : ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామానాగేశ్వరరావు!

ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా..

ఇక కవిత ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించానని, పార్లమెంట్ లో అడుగు పెట్టిన తొలి బంజారా మహిళగా తనకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు తన పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోనే ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజల అందరికీ తెలిసిన దాన్నేనంటూ ఎంపీ కవిత చెప్పుకొచ్చారు. కాగా ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలన్న ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. గిరిజనులు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

#maloth-kavitha #lok-sabha-elections-2024 #mahabubabad-parliament
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe