Vijayawada: విజయవాడలో 'మేకుల బాబా'.. భారీగా సొమ్ము కాజేసేందుకు స్కెచ్!!

విజయవాడకు చెందిన సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని రూ.35 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ఎంత ప్రయత్నించినా తిరిగి అమ్ముడు పోవడం లేదు. దీంతో రజనీ ఆందోళనకు గురైంది. అయితే తనకు సన్నిహితంగా ఉన్న ఒక మహిళతో ఈ సమస్యను పంచుకుంది. ఈమె అప్పుడు మేకుల బాబా గురించి చెప్పింది. దీంతో రజినీ నేరుగా అతన్ని కలిసి, స్థలం సమస్య చెప్పింది. ఇదే అదునుగా భావించిన దొంగ బాబా.. భారీగా సొమ్ము కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. ఇక రజినీకి నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. దీంతో ఆ దొంగ బాబా భయపెట్టడం మొదలు పెట్టాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని అన్నాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

Machilipatnam Police registered a Case against on Fake Baba in Vijayawada: పోలీసులు ఎన్ని రకాల కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా.. ఎక్కడిక్కడ క్రైమ్ పెరిగిపోతూనే ఉంది. అలాగే దొంగ బాబాలు కూడా ఎక్కడికక్కడ వెలుస్తూనే ఉన్నారు. అంతే మాదిరిగా జనం కూడా వారిని గుడ్డిగా నమ్మి, మోసపోతున్నారు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న అందినకాడికి దోచేస్తున్నారు దొంగ బాబాలు. తాజాగా ఇప్పుడు 'మేకుల బాబా' తెరపైకి వచ్చాడు. మేకులు కొడితే ఇంట్లో ఉన్న దోషం పోతుందని అందర్నీ నమ్మించి మోసం చేస్తున్నాడు. ఈ బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని రూ.35 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ఎంత ప్రయత్నించినా తిరిగి అమ్ముడు పోవడం లేదు. దీంతో రజనీ ఆందోళనకు గురైంది. ఏం చేయాలో తెలీక తికమక పడుతుంది. అయితే తనకు సన్నిహితంగా ఉన్న ఒక మహిళతో ఈ సమస్యను పంచుకుంది. ఈమె అప్పుడు మేకుల బాబా గురించి చెప్పింది. దీంతో రజినీ నేరుగా అతన్ని కలిసి, స్థలం సమస్య చెప్పింది. ఇదే అదునుగా భావించిన దొంగ బాబా.. భారీగా సొమ్ము కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు.

ఇక రజినీకి నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. దీంతో రజినీ సంతోషించింది. దీంతో ఆ దొంగ బాబా భయపెట్టడం మొదలు పెట్టాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని అన్నాడు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు