World cup: వరల్డ్ కప్‌కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..స్టార్‌ కీపర్‌కు నో ఛాన్స్!

టీమిండియా ప్రపంచ కప్ జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్(కెప్టెన్), విరాట్, అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్‌ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీరాజ్, మొహమ్మద్ షమీరాజ్ , కుల్దీప్ యాదవ్.

New Update
World cup: వరల్డ్ కప్‌కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..స్టార్‌ కీపర్‌కు నో ఛాన్స్!

World cup squad 2023: వరల్డ్‌కప్‌కి మరో నెల రోజులే సమయం ఉంది.. అక్టోబర్‌ 5న ప్రపంచ కప్‌ మొదలుకానుండగా.. టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఊహించినట్టుగానే జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు. గాయంతో నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌నే ప్రధాన వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్‌ టైమ్‌లో గాయపడ్డా కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌కి సెలక్ట్ అయ్యాడు. అయితే మరో కొత్త గాయం కావడంతో తొలి రెండు మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఆసియా కప్‌కు ముందు జరిగిన ఫిట్‌నెస్‌ పరీక్ష యో-యో టెస్టులోనూ రాహుల్‌ పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం రాహుల్‌ ఫిట్‌గానే ఉన్నాడని సమాచారం. ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు రాహుల్‌ బరిలోకి దిగే ఛాన్స్‌ కనిపిస్తోంది.

ఇషాన్‌కి ఛాన్స్:

మరోవైపు సెకండ్ వికెట్ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ని (Ishan Kishan) సెలక్ట్ చేశారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ సత్తా చాటాడు. టాప్‌-4 బ్యాటర్లు వికెట్లు పారేసుకున్న చోట నిలపడి టీమ్‌ని గట్టెక్కించాడు. పాండ్యాతో కలిసి 138 పరుగుల పార్ట్‌నెర్‌షిప్‌ నెలకొల్పాడు. తొలిసారి నంబర్‌-5 పొజిషన్‌లో బ్యాటింగ్ చేసిన ఇషాన్‌ అంచనాలకు మించి రాణించాడు. పాక్‌ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న పిచ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడు. ఇక స్నిన్నర్లు చహల్‌, అశ్విన్‌కి జట్టులో స్థానం దక్కలేదు. అశ్విన్‌ చాలా కాలంగా టెస్టులకే పరిమితమయ్యాడు. అటు చహల్‌కి కూడా ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. స్పిన్నర్లుగా అక్షర్‌ పటేల్, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో ఉన్నారు. ఇక పేసర్లగా బుమ్రాతో పాటు ఠాకూర్‌, షమి, సిరాజ్‌ సెలక్ట్ అయ్యారు. ఇక వన్డేల్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వని సూర్యకుమార్‌ యాదవ్‌ని కూడా టీమ్‌లోకి తీసుకుంది బీసీసీఐ. ఇక నంబర్‌-4 పొజిషన్‌లో అయ్యర్‌పైనే నమ్మకం పెట్టుకుంది. నాలుగు నెలలగా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టని అయ్యర్‌ ఇటివలి పాకిస్థాన్‌పై పోరులో రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిరాగానే రెండు ఫోర్లు బాది మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించినా వెంటనే వికెప్ పారేసుకున్నాడు.

టీమిండియా ప్రపంచ కప్ జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్(కెప్టెన్), విరాట్, అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్‌ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ , కుల్దీప్ యాదవ్.

ALSO READ: సచిన్ చేతుల మీదుగా ముత్తయ్య బయోపిక్ ట్రైలర్

ALSO READ: గుడ్‌న్యూస్‌ చెప్పిన బుమ్రా.. తండ్రైన యార్కర్‌ కింగ్‌..పిల్లాడి పేరు తెలుసా?

Advertisment
తాజా కథనాలు