Nose Bleeding: వేసవిలో అధిక వేడి కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యను తొలగించడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
వేసవిలో అధిక వేడి కారణంగా చాలా మందికి ముక్కు నుంచి రక్తం కారడం గమనిస్తుంటాము. ముక్కులో అలెర్జీ, అంతర్గత సిరలు లేదా ముక్కు రక్త నాళాలు దెబ్బతినడం, అధిక వేడి, మసాలాలు అధికంగా తీసుకోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం, ముక్కుకు గాయం, సైనస్ వంటి అనేక కారణాలు ముక్కు నుంచి రక్తం రావడానికి కారణం కావచ్చు. , మలేరియా, టైఫాయిడ్, అధిక తుమ్ములు, ముక్కును ఎక్కువగా రుద్దడం మొదలైనవి కూడా దీనికి కారణాలు అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము
చిట్కాలు
ముక్కు మూసుకోండి
ముక్కు అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభిస్తే, వెంటనే దాని పై మెల్లిగా ప్రెస్ చేస్తూ కొంచం గట్టిగా పట్టుకోండి. ఇలా చేయడం వల్ల నాసికా సెప్టం మీద ఒత్తిడి పడుతుంది. ఇది రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోండి. ఈ రెమెడీని సుమారు 1 నిమిషం పాటు చేస్తే, ముక్కు నుంచి రక్తస్రావం ఆగిపోతుంది.
ఐస్ క్యూబ్స్
ముక్కు నుంచి రక్తం కారుతున్న సందర్భంలో, 2-3 నిమిషాలు తేలికపాటి ఒత్తిడితో ముక్కుపై ఐస్ క్యూబ్స్ ప్యాక్ ఉంచండి. ఇలా చేయడం వల్ల ముక్కు లోపల చల్లబడి, ముక్కు నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. మంచు చల్లదనం రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.
ఉల్లిపాయ రసం
ముక్కులో రక్తస్రావం సమస్యకు ఉల్లిపాయ నివారణను కూడా ప్రయత్నించవచ్చు. దీని కోసం, ఉల్లిపాయను మిక్సీలో మెత్తగా రుబ్బు దాని రసాన్ని బయటకు తీయండి. ఇప్పుడు ఉల్లిపాయ రసంలో దూదిని ముంచి, 2-3 నిమిషాలు ముక్కుపై ఉంచండి. ఉల్లిపాయ వాసన రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది, ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది.
ఇలాంటి సమస్యలు ఎదుర్కునే వారు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి
- తరచుగా ముక్కు నుంచి రక్తస్రావం జరగడం
- తలకు గాయం అయిన వారిలో ముక్కు నుంచి రక్తస్రావం జరిగినప్పుడు
- బ్లడ్ తిన్నరస్ మెడికేషన్ పై ఉన్న వారు ఈ సమస్యను నిర్లక్యం చేయరాదు.
- 10-15 రక్తస్రావం నిమిషాల కంటే ఎక్కువ సమయం ముక్కు నుంచి రక్తం కారడం
ముక్కు నుంచి రక్తం వచ్చేటప్పుడు గుండె దడగా అనిపించడం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.