Life Style: దిండు పెట్టుకొని నిద్రపోతున్నారా..?

రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. అయితే ఇది కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు పై(బోర్లా) పడుకునే వారు దిండు పెట్టుకోవడం వల్ల శరీర బరువంతా మధ్య భాగంలో ఉంటుంది. ఇది వెన్నెముక, మెడపై ఒత్తిడి కలిగిస్తుంది.

author-image
By Archana
New Update
Health Tips

Health Tips: రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. చాలా మంది తమ సౌకర్యానికి అనుగుణంగా దిండును ఉంచుకోవడానికి ఇష్టపడతారు. కొంత మందికి పెద్దగా, మృదువైన దిండ్లను ఇష్టపడతారు, మరికొంతమంది సన్నని వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇంకొంతమంది మాత్రం దిండు పెట్టుకొని నిద్రపోవడం అసలు మంచిదే కాదు, ఆరోగ్యానికి హానికరం అని భావిస్తారు. దీనికి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి. తల కింద దిండు పెట్టుకోవడానికి అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము.. 

నిపుణులు ఏం చెబుతున్నారు? 

హెల్త్ లైన్ నివేదికల ప్రకారం.. కొంత మందికి దిండు లేకుండా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు పై(బోర్లా) పడుకునే వారికి మాత్రం దిండు లేకుండా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం తల కింద దిండు పెట్టుకొని కడుపు పై పడుకోవడం వల్ల వెన్నెముక అసహజ స్థితిలో ఉంటుంది. దీని వల్ల శరీర బరువు మొత్తం మధ్య భాగం పై పడుతుంది. ఇది వెన్నెముక, మెడ పై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకని బోర్లా పడుకునే వారు దిండు లేకుండా నిటారుగా పడుకుంటే మెడ పై ఒత్తిడి తగ్గుతుంది.

దిండు ఎవరు ఉపయోగించాలి..?

వెనుక భాగం పై పడుకునేవారు దిండు లేకుండా నిద్రపోవడం హానీ కలిగిస్తుంది. వెన్నెముకను సమానంగా ఉంచడానికి దిండును ఉపయోగించాలి. మెడ నొప్పి లేదా మరేదైనా సమస్య ఉన్నవారు కూడా దిండును వాడడం మంచిది. దిండు మెడకు సపోర్ట్ గా ఉంటుంది. అలాగే సైడ్ స్లీపర్స్.. పక్కకు పడుకునేవారు దిండు లేకుండా పడుకోవడం వల్ల భుజాలు, మెడ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది, ఇది వారి నిద్రను పాడు చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు