Cleaning Tips: ఈ చిన్న ట్రిక్‌తో ఇళ్లంతా మెరిసిపోతుంది బాసూ.. ఈ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!

నిమ్మకాయ రసంతో ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు. నిమ్మకాయతో స్టవ్ టాప్ శుభ్రం చేసుకోవచ్చు. మీ వంటగది టైల్స్ ను నిమ్మకాయతో క్లీన్‌ చేసి చూడండి. మీ స్టీల్ పాత్రలను నిమ్మకాయతో క్లీన్‌ చేస్తే అవి మెరిసిపోతాయి. మీ చాపింగ్ బోర్డును నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు.

Cleaning Tips: ఈ చిన్న ట్రిక్‌తో ఇళ్లంతా మెరిసిపోతుంది బాసూ.. ఈ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!
New Update

నిమ్మకాయతో అనేక ప్రయోజనాలున్నాయి. నిమ్మ రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వంటగదిని శుభ్రపరిచేందుకు నిమ్మ తొక్కలు రసం ఉపయోగపడతాయి. వంటగదిని మెరిసేలా చేయడంతో పాటు మంచి వాసన వచ్చేలా చేయడంతో నిమ్మరసాన్ని మించింది లేదు. మొండి మరకలను సులభంగా వదిలించుకునేందుకు నిమ్మరసం ఉపయోగపడుతుంది.

స్టీల్ పాత్రల కోసం నిమ్మకాయ:
స్టీల్ పాత్రలను క్లీన్ చేయడానికి నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టీల్ పాత్రలను ఎక్కువగా ఉపయోగించే కొద్దీ అవి సహజంగా ఉండే బ్రైట్‌నెస్‌ని కోల్పోతాయి. మీ పాత్రలు మళ్లీ షైన్ అవ్వడానికి నిమ్మకాయను ఉపయోగించండి. నిమ్మతొక్కతో పాత్రలను కడగవచ్చు. కిచన్‌లోని సింక్‌ని క్లీన్‌ చేయడానికి కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. వాటితో గట్టిగా రుద్దండి.. అప్పుడు క్లీన్ అవుతాయి.

మీ చాపింగ్ బోర్డును నిమ్మకాయతో శుభ్రం చేయండి:
కొన్ని మరకలు ఊరికే పోవు.. వాటిని కఠినమైన మరకలంటారు. చాపింగ్‌ బోర్డుపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడానికి నిమ్మరసాన్ని ఉపయోగించండి. నిమ్మరసాన్ని చాపింగ్‌ బోర్డుపై రుద్దిన తర్వాత కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. నిమ్మకాయలోని సహజ యాసిడ్‌ లక్షణాలు మరకలను పొగొడుతాయి. చెడు వాసనలను తొలగించడానికి పనిచేస్తాయి కూడా. ఇదంతా చేసిన తర్వాత చాపింగ్‌ బోర్డును నీటితో కడగాలి.

స్టవ్‌ టాప్‌ను క్లిన్ చేయడానికి లెమన్‌ బెస్ట్:
స్టవ్‌ టాప్‌లపై ఏర్పడే జిడ్డు ఊరికే పోదు. వాటిని పొగొట్టడం చాలా కష్టమైన పని. స్పాంజ్‌తో క్లీన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా హార్డ్‌గా క్లీన్ చేస్తేనే మరకలు పోతాయి. నిమ్మరసానికి జిడ్డును వదిలించే శక్తి ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియను ఎక్కువసార్లు చేయండి.. స్టవ్ టాప్‌ క్లీన్ అవుతుంది.

కిచన్‌ టైల్స్‌ను నిమ్మకాయతో క్లీన్ చేయవచ్చు:
వంటగదిలోని మురికి టైల్స్‌ను క్లీన్ చేయడానికి నిమ్మకాయ బ్లీచ్‌ను ఉపయోగించవచ్చు. బోరాక్స్ పౌడర్‌ని నిమ్మరసంతో కలపాలి. వాటితో క్లీన్ చేయవచ్చు లేకపోతే నిమ్మకాయ తొక్కను పారవేయకుండా వాటితో క్లీన్ చేయాలి. వీటి సాయంతో టైల్స్‌ను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసాన్ని కలపాలి. ఇప్పుడు దాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి టైల్స్‌పై స్ప్రే చేసి స్క్రబ్బర్‌తో రుద్దాలి. టైల్స్ మెరుస్తాయి.

ALSO READ: ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!

#cleaning-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe