Krishna Mukunda Murari Serial: ముకుంద మురారి పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. పెళ్లి జరుగుతుందని ఎంతో సంతోష పడుతుంది ముకుంద. మరోవైపు కృష్ణ ఏమో తన భర్త మురారికి మరో పెళ్లి చేస్తున్నారని ఏడుస్తూ ఉంటుంది. శ్రీధర్ ను చంపాల్సిన అవసరం ముకుందకు తప్ప ఎవరికి ఉంది? అని మురారితో అంటుంది. ముకుందకు తనను పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ తప్ప వేరే వ్యక్తిని చంపే అంత ఉండదని అంటాడు మురారి. ఇలా భార్య భర్తలిద్దరూ బాధ పడుతూ ఉంటారు.
నిందితుడు దేవ్ అని గుర్తించిన కృష్ణ
ఇదిలా ఉండగా మరోవైపు నిందితుడు దేవ్.. కృష్ణ కు సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ డ్రామా ఆడుతాడు. నేను ఉండి కూడా నీకు ఏం చేయలేకపోతున్నానని అంటాడు. ఎలాగైనా చిన్నాన్న పెద్దపల్లి ప్రభాకర్ ని జైలు నుండి రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. అయితే, అప్పుడు కృష్ణ దేవ్ ఉంగరాన్ని చూస్తుంది. శ్రీధర్ చనిపోయినప్పుడు అతడి ఫేస్ పై ఉన్న ఉంగరం గుర్తు.. సేమ్ దేవ్ కు ఉండడంతో హంతకుడు దేవ్ అని తెలుస్తుంది. వెంటనే యూ ఛీటర్ అంటూ అతడి కాలర్ పట్టుకుంటుంది.
షాక్ లో కుటుంబసభ్యులు..
దీంతో, కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఏమెంది కృష్ణ అంటూ షాక్ అవుతారు. శ్రీధర్ ని చంపింది వీడే ఏసీపీ సార్ అంటూ చెబుతుంది కృష్ణ. చూడండి అదే రింగ్ అనేసి దేవ్ చేతికి ఉన్న రింగ్ ను చూపిస్తుంది. దేవ్ చంపడం ఏంటని భవానీ ప్రశ్నిస్తుంది. పెద్దమ్మ కాసేపు మీరు మాట్లాడకండి అంటూ దేవ్ కాలర్ పట్టుకుని.. శ్రీధర్ ను చంపింది నువ్వేనా..ఈ ఉంగరం ముద్ర తన చెంపపై పడింది అని అడుగుతాడు. సిల్లీ ఏం మాట్లాడుతున్నావ్ బావ ఉంగరం నాదే షాపులో కొన్నాను..ఇలాంటిది వేరే ఎవరికి ఉండదా అంటాడు.
దేవ్ అరెస్ట్..పెళ్లి క్యాన్సిల్
ఇంతలోనే పరిమళ పోలీసులని తీసుకుని ఇంటికి వస్తుంది. దీంతో, అసలు నిజం బయటపడుతుంది. నా చెల్లి ముకుంద కోసం తన ఆనందం కోసం నేను ఈ పని చేశానని తన తప్పును ఒప్పుకుంటాడు దేవ్. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుని వెళతారు. పెళ్లి ఆగిపోవడంతో కృష్ణ మురారి హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. క్యాన్సిల్ అయినందుకు ముకుంద ఏడుస్తూ ఉంటుంది.