Komaram Bheem Dist: ఆసిఫాబాద్‌లో జిల్లాలో 48 గంటలు ఇంటర్నెట్ బంద్

TG: కొమరం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జైనూరులో గిరిజనురాలిపై అత్యాచారం ఘటనపై ఆదివాసీలకు, మరో వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు అక్కడ 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.

Komaram Bheem Dist: ఆసిఫాబాద్‌లో జిల్లాలో 48 గంటలు ఇంటర్నెట్ బంద్
New Update

Komaram Bheem Dist: కొమరం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. జైనూరులో గిరిజనురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని పెద్దయెత్తున స్థానికులు ఆందోళనలు చెప్పట్టారు. మొన్న అర్ధరాత్రి నుంచి అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆదివాసీలకు, మరో వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అలర్ట్ అయిన పోలీసులు 48 గంటలు ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేశారు. 2 వేల మంది పోలీసుల పహారాలో జైనూరు ఉంది. అల్లర్లను అదుపు చేసేందుకు స్పెషల్‌ ఫోర్స్‌ ను దింపింది పోలీస్ శాఖ.

శాంతిభద్రతలు పరిశీలించేందుకు జైనూరులో పోలీసు ఉన్నతాధికారులు పర్యటించారు. కాగా ఇంకా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. బయట ముగ్గురు కంటే ఎక్కువ మంది జమ కుడితే పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. గుంపులుగా గుమి కుడొద్దని.. ఎవరైనా అలా చేరితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా పిల్లలు, పెద్దలు అంత ఇంటికే పరిమితం అయ్యారు.మరో వైపు బాధిత మహిళా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని.. నేరస్థులను శిక్షించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

#komaram-bheem-dist
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe