INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్‌ కంపెనీ!

ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్‌ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్‌ కంపెనీ!

Tech Company Layoffs : ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ (Intel) తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మార్కెట్‌ వాటాను కూడా పెంచుకొనే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ వివరించింది.

ఇంటెల్‌ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి, సెమీ కండక్టర్‌ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టేందుకు చేయాల్సిన పరిశోధన, అభివృద్ది పై భారీగా ఖర్చు చేయాలని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్‌ (PAT Gelsinger) నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఖర్చులను కూడా తగ్గించుకోవడం గురించి దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఇలా ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్‌ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఇంటెల్‌ 2023 లో తన శ్రామిక శక్తిని 5 శాతం మేర తగ్గించుకుంది. భారత్‌ లో హైదరాబాద్‌, బెంగళూరులో 13 మంది విధులు నిర్వహిస్తున్నారు.

Aslo read: మట్టి మిద్దె కూలి నలుగురి మృతి!

Advertisment
తాజా కథనాలు