AP Sarpanch Leaders: ఏపీలో సర్పంచుల సంఘం నేతలు మరోసారి ఆందోళనకి దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు సర్పంచులు. ప్రభుత్వానికి వ్యక్తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ గళం వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా సొంత డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వం కనీసం మా సొమ్ము ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుందని మహిళ సర్పుంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తమకు విలువ లేకుండా చేశారని జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చే తమ సమస్యలు పరిష్కరించాలని వాపోయారు.
Also Read: పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క్లారిటీ..!
ఇలా ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఏపీలో సర్పుంచుల పరిస్థితి దయానియంగా కనిపిస్తుంది. అభివృద్ధి కోసం అప్పు చేసి మరి గ్రామాలను డెవలప్ చేస్తే మమ్మల్ని రోడ్డెక్కేలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పుల బాధతో పలువురు గ్రామ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం.