Vijay Devarakonda: ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా.. ఆ బ్యాచ్ కు రౌడీ మేనమామ కౌంటర్!

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పై వస్తున్న నెగిటివిటీ పై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ మేనమామ యష్ రంగినేని కూడా దీని పై రియాక్ట్ అయ్యారు. ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా..? అంటూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Vijay Devarakonda: ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా.. ఆ బ్యాచ్ కు రౌడీ మేనమామ కౌంటర్!

Yash Rangineni On Family Star Negative Trend: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

Also Read : Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!

అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి మూవీ బాగవులేదని రివ్యూలు రాయడం, సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వంటివి చేస్తున్నారు కొంతమంది. దీని పై  నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే స్పందించారు. "కష్టపడి తీసిన సినిమా పై కొందరు అలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం సరి కాదని. ఇలాంటి పద్ధతి కొనసాగితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చు అంటూ దిల్ రాజ్ మాట్లాడారు.

Yash Rangineni On Family Star Negative Trend

నెగిటివ్ ప్రచారం

ఇది ఇలా ఉంటే.. మరో వైపు హీరో విజయ్ దేవరకొండ టార్గెట్ గా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ.. ఆయన పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. తాజాగా విజయ్ మేనమామ యష్ రంగినేని ఈ నెగిటివ్ పబ్లిసిటీ పై రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన.. ఇలా రాసుకొచ్చారు.

Yash Rangineni On Family Star Negative Trend

విజయ్ మేనమామ పోస్ట్

"ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు. మీ నెగటివ్ బ్యాచ్ కి వాడంటే ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్ళని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఏ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా ?"

Also Read: Ram Charan- Upasana: క్లింకారతో రామ్ చరణ్ థైలాండ్ వెకేషన్.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
తాజా కథనాలు