Digestive Tips: బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ కాలంలో చాలా మంది రోజూ తినే ఆహారపు అలవాట్ల పై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం రోజూ తీసుకునే హెల్తీ ఫుడ్స్ పై ఆధారపడి ఉంటుంది. కొంత మంది బిజీగా ఉంటూ బయట ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా తింటారు. ఇది మలబద్దకం, కడుపులో ఇబ్బంది, మంట, గ్యాస్, కడుపుబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఇలాంటి జీర్ణక్రియ ఇబ్బందులను తొలగించడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
జీర్ణ సమస్యలను తొలగించడానికి ఈ టిప్స్ పాటించండి
బ్యాలెన్స్డ్ డైట్
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, చిరు ధాన్యాలు అన్ని రకాల పోషకాహారాలు మీ డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఫైబర్ ఫుడ్స్
ఫైబర్ ఎక్కువగా లభించే కూరగాయలు, పండ్లు, బీన్స్ ఆహారాలు తినండి. ఫైబర్ బోవేల్ మూమెంట్ ఫ్రీగా చేసి.. మలబద్దకం, కడుపుబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒకే సారి మీ ఆహారంలో ఫైబర్ శాతం పెంచడం మంచిది కాదు. క్రమంగా ఫైబర్ ఇంటెక్ పెంచాలి.
Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే
సరైన నీళ్లు
శరీరానికి కావాల్సినంత నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజుకు 4-5 లీటర్ల నీళ్లు తాగాలి. ఇది స్టూల్ సాఫ్ట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. దీంతో మలబద్దకం సమస్యను నివారించవచ్చు.
ప్రీ బయోటిక్స్
డైట్ లో ప్రీ బయోటిక్స్ అలవాటు చేసుకోండి. పెరుగు, ఫెర్మెంటేడ్ ఫుడ్స్.. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాదు జీర్ణక్రియను పెంచుతుంది.
వ్యాయామం
ప్రతీ రోజూ 20-30 వరకు శారీరక శ్రమ చేయాలి. ఇది పేగు కదలికలను ప్రేరేపించి.. ఆరోగ్యమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాగే మలబద్ధకము, కడుపుబ్బరం సమస్యలను దూరం చేస్తుంది.
ఫ్యాట్, స్పైసీ ఫుడ్స్ తక్కువగా తీసుకోండి
సాధారణంగా హై ఫ్యాట్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి చాలా కష్టమవుతుంది. కొంత మందికి ఇవి పొట్టలో ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. అందుకని ఫ్రైడ్, హెవీ స్పైస్ ఫుడ్స్ తగ్గించి.. లీన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Sleeping Tips: మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్.. ఇవి పాటిస్తే హ్యాపీగా నిద్రపోతారు!