Copper Vessels: ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పురాతన కాలం నుంచి ఇప్పటికీ రాగి పాత్రలను తినడానికి, తాగడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా, రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు వివరించబడ్డాయి. ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా నాశనమైపోయి నీరు స్వచ్ఛంగా మారుతుంది. అయితే రాగి పాత్రల్లో తినడం, తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. ఏడాది పొడవునా రాగి పాత్రలను ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో రాగి పాత్రలను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు.
వేసవిలో రాగి పాత్రలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు
- వేసవిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చాలా మంది ఈ సీజన్ లో జీర్ణ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రాగి పాత్రలు ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే సహజంగానే రాగి స్వభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ఇది వేసవి కాలానికి అనువైనదిగా పరిగణించబడదు. రాగి పాత్రలలో ఆహారాన్ని వండడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, మైకముతో పాటు ముక్కు నుంచి రక్తస్రావం, ఆకలి లేకపోవటం, అతిసారం వంటి సమస్యలతో బాధపడవచ్చు.
- పాలు లేదా పాల ఉత్పత్తుల కోసం రాగి పాత్రలు వాడకూడదు. పాలలో ఉండే లాక్టో యాసిడ్ రాగితో కలిసిన వెంటనే నాశనం అవుతుంది. అంతే కాదు పాలను ఈ పాత్రలో ఎక్కువసేపు ఉంచితే విషపూరితం అవుతాయి. దీన్ని తాగడం వల్ల వాంతులు వచ్చే అవకాశం ఉంది.
- రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవిలో, ఒకటి కంటే ఎక్కువ గ్లాసులు నీరు రాగి పాత్రలో తాగకూడదు. దీని వల్ల జీర్ణక్రియ, చర్మ సమస్యలు వస్తాయి.
- రాగి పాత్రలలో పుల్లని పదార్థాలు తినడం, తాగడం వల్ల అసిడిక్ రియాక్షన్ వస్తుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. దీని కారణంగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Nose Bleeding: వేసవిలో ముక్కు నుంచి బ్లడ్ వస్తుందా .. ఇలా చేయండి..! - Rtvlive.com