Hair Care Tips: మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ పండ్లను తినండి..

మీ జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. జస్ట్ మీ లైఫ్ స్టైల్ లో ఛేంజ్ చేసుకుంటే చాలు మీ జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పండ్లు తినడమే. అవకాడో, గ్రేప్స్, దానిమ్మ వంటి పండ్లు తింటే జుట్టు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

Hair Care Tips: మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ పండ్లను తినండి..
New Update

Fruits for Long and Healthy Hair: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజల అనేక రకాల టెన్షన్లతో సతమతం అవుతున్నారు. సరికాని జీవనశైలి(Lifestyle), జంక్ ఫుడ్స్, సమయపాలన లేని భోజన వేళలు.. వెరసి ప్రజలు అనేక రకాల శారీరక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యతో పాటు.. అన్నింటికి మించి జుట్టు(Hair Care) సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేవారు చాలా మందే ఉన్నారు. పొలుష్యన్, సరికాని జీవనశైలి, అన్ హెల్తీ ఫుడ్స్ వల్ల జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయితే, ఈ సమస్యలకు పెద్ద పెద్ద ట్రీట్‌మెంట్స్ అవసరం లేదని, జస్ట్ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అవును, జుట్టు పెరుగుదల కోసం, సంరక్షణ కోసం పండ్లు తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లు ఆరోగ్యాన్నే కాకుండా.. జుట్టును కూడా సంరక్షిస్తాయని చెబుతున్నారు. మరి ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. అవోకాడో తినడం వలన జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పొడవుగా, మందంగా ఉండాలంటే అవకాడోను తినాలని సూచిస్తున్నారు. అవకాడోలో జుట్టు పెరుగుదలకు అవసరమైన బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టుకు విటమిన్ ఇ ప్రయోజనాలను అందిస్తుంది.

2. జుట్టు పెరుగుదలకు అర్గాన్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రూట్ అని చెబుతున్నారు నిపుణులు. అర్గాన్ ఫ్రూట్‌లో విటమిన్ ఇ, ఎ, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి జుట్టు పెరుగుదలకు అవసరమైన అన్ని విటమిన్లు ఉంటాయి.

3. ఆలివ్ ఫ్రూట్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. సహజ జుట్టు పెరుగుదలకు ఆలివ్‌లను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యవంతమైన జుట్టును పొందడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

4. జుట్టు పెరుగుదలకు దానిమ్మ పండు ఉత్తమం అని చెప్పొచ్చు. విటమిన్ సి, కె, బి పుష్కలంగా ఉన్న దానిమ్మ జుట్టుకు సూపర్ ఫుడ్. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన, మందపాటి జుట్టు కోసం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

5. ద్రాక్షపండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ డల్, లింప్ హెయిర్‌ని రివైట్ చేస్తుంది. ద్రాక్షపండు జుట్టు పెరుగుదలకు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

6. కొబ్బరి జుట్టుకు చాలా మంచిది. అందుకే కొన్నేళ్లుగా జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నాం. కొబ్బరిలో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును మందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also Read:

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

#hair-care-tips #health-hair #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe