GPS:ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్‌..!

ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌ని ఏపీ ప్రభుత్వం ముందు గట్టిగా వినిపిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మంత్రులతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలో మంత్రి బొత్స చర్చించారు. కొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగినట్టు బొత్స చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టు తెలిపారు.

New Update
GPS:ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్‌..!

సీపీఎస్‌ వర్సెస్‌ జీపీఎస్‌ వార్‌ ముదురుతోంది. జీపీఎస్‌ (GPS)పై ఉద్యోగ సంఘాలతో చర్చలను సీపీఎస్(CPS) ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ని ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. మంత్రులు బొత్స, బుగ్గన, సీఎస్‌ జవహర్‌రెడ్డి, సజ్జల, ఆర్థికశాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు భేటి అయ్యారు.

ఎవరెవరు ఏం అన్నారంటే?
రాజేష్,సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

➼ సీఎం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి.

➼ ఏపీ సీఎం ఇచ్చిన మాటను వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయి.

➼ మొత్తం పెన్షన్ డబ్బులు అన్నీ ఆన్స్యూటి సర్వీస్ ప్రొవైడర్ కు ఇవ్వాలి.

➼ నగదు విషయాలు అన్నీ ఆర్డినెన్స్ లో పొందుపరచాలి.

➼ ఆర్డినెన్సు అర్థ రహితంగా ఉంది.

బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఏం అన్నారంటే:

➼ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాం.

➼ ఓపీఎస్ ఉద్యోగుల మాదిరిగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోరాం.

➼ ఏడాదికి రెండు సార్లు డీఆర్ ఇచ్చేందుకు అంగీకరించారు.

➼ అడిషనల్ క్వాoటం పెన్షన్,పీఆర్సీ,హెల్త్ కార్డులు,కముటేషన్ ఇవ్వాలని కూడా కోరాం.

➼ ఉపాధ్యాయులు మా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.

➼ ఉద్యోగులకు సీపీఎస్ లేదా జీపీఎస్ లో ఏదైనా ఎంచుకునే అవకాశం ఇస్తామన్నారు

➼ ఉద్యోగులు నగదు తీసుకుంటే మిగిలిన నగదును మాత్రమే పెన్షన్ ఇస్తారు.

శివా రెడ్డి,ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్:

➼ ఓపీఎస్ కావాలని మరోసారి ఆడిగాము.

➼ గ్రాట్యుటీ,ఫ్యామిలీ పెన్షన్ ఉంటుందని మొదట్లో అనుకున్నాం.

➼ 10 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా ఇవ్వాలని కోరాము.

➼ మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు.

ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం:
అటు భేటీ తర్వాత మంత్రి బోత్స సత్యనారాయణ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు సుహృదభవ వాతావరణంలో జరిగాయన్నారు బొత్స. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగినట్టు చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టు తెలిపారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఫైర్ అయ్యారు బొత్స. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఉగాది తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుచూపుమేరలో కనపడదన్నారు బొత్స. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలని.. మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలో తెలియదా అని ప్రశ్నించారు. మనిషికి వయసు కాదు పరిపక్వత ఉండాలని.. ఎన్నికల ప్రజాక్షేత్ర౦లో ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు. ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తామన్నా బొత్స.

ALSO READ: అచ్చం తండ్రిలానే.. మహేశ్‌ తనయుడు గౌతమ్‌ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

Advertisment
తాజా కథనాలు