Google Pay to launch sachet loans: గూగుల్ పే తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత దేశంలోనే ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ గా గుర్తింపు పొందిన గూగుల్ పే తమ వినియోగదారులకు సాచెట్ లోన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా వార్షికోత్సవం సందర్బంగా తమ వినియోగదారులకు, వ్యాపారులకు సాచెట్ లోన్స్ అందిస్తామని తెలిపింది. ఈ రుణాలను గూగుల్ పే యాప్ ద్వారా పొందవచ్చు. ఈ రుణాలను వినియోగదారులకు అందించడానికి DMI ఫైనాన్స్ బ్యాంకులతో భాగస్వామ్యం అయినట్టు పేర్కొంది.
ఈ సాచెట్ లోన్స్ లో గూగుల్ పే వినియోగదారులకు రూ.. 10,000 నుంచి రూ.. 1లక్ష వరకు రుణాలను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే వినియోగదారులు ఈ రుణాలను 7 రోజుల నుండి 12 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించే విధంగా ఉంటాయని తెలిపింది. వినియోగదారులకు, వ్యాపారులకు చిన్న మొత్తంలో రుణాలను అందించడానికి గూగుల్ DMI ఫైనాన్స్ బ్యాంకులతో చేతులు కలిపినట్లు తెలిపింది. వినియోగదారులు చిన్న మొత్తానికి మరొకరిని ఆశ్రయించకుండా గూగుల్ పేనే నేరుగా లోన్ ఇవ్వనున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈ సాచెట్ లోన్ ద్వారా యూజర్లు గూగుల్ పే నుంచి రూ.15000 తీసుకుంటే దానికి ప్రారంభ EMI 111రూ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అలాగే చిన్న వ్యాపారుల కోసం క్రెడిట్ లైన్లను విస్తరించేందుకు ఈ కంపెనీ 'ICICI Bank' 'ePayLater' వంటి రుణ సంస్థలతో భాగస్వామ్యం అయినట్లు తెలిపింది.
Also Read: Celect Mobiles: దసరా ఆఫర్లతో వచ్చేసిన సెలెక్ట్ మొబైల్స్!