Janasena: జనసేనకు ఊరట..గాజుగ్లాసు గుర్తు వారికే..

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట లభించింది. గాజు గ్లాసును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.. వేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈసీ జనసేనకే గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Janasena:  జనసేనకు ఊరట..గాజుగ్లాసు గుర్తు వారికే..
New Update

Janasena: ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట లభించింది. గాజు గ్లాసును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.. వేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈసీ జనసేనకే గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కరెక్ట్‌గా ఎన్నికల హడావుడి మొదలైంది...జనసేనకు గుర్లు టెన్షన్ పట్టుకుంది. పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.

పవన్ కళ్యాణ్ కు ఈసీ ఝలక్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉహించని షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్థత నెలకొంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసు గుర్తు పెట్టారు ఎన్నికల అధికారులు.గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే గ్లాసు గుర్తుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్ట్‌లో చేర్చడంపై న్యాయ నిపుణులతో జనసేన నేతలు చర్చిస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఈసీ నిర్ణయంతో అందరిలో సస్పెన్స్ నెలకొంది.

Also Read:Indigo Flight: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఫ్లైట్..2 నిమిషాల ఫ్యూయల్ ఉందనగా ల్యాండింగ్

#glass-symbol-janasena
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe